ఎమ్మెల్సీగా ఫరీదుద్దీన్ ప్రమాణస్వీకారం

20 Oct, 2016 15:09 IST|Sakshi
హైదరాబాద్: ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన ఫరీదుద్దీన్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఆయన ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. 
 
కాగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా గెలిచిన మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరపున గెలవడం, అనంతరం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం తెలిసిందే.
మరిన్ని వార్తలు