ఫరీదాబాద్-ఢిల్లీ ప్రయాణం మరింత సుగమం

26 Dec, 2013 23:01 IST|Sakshi
 సాక్షి, న్యూఢిల్లీ: మెట్రోరైలు ప్రయాణికులకు కొత్త సంవత్సరం సరికొత్త సదుపాయాలతో స్వాగతం పలకనుంది. వచ్చే ఏడాది ప్రారంభమయ్యే మెట్రోప్రాజెక్ట్‌లతో ఫరీదాబాద్-ఢిల్లీ ప్రయాణం మరింత సుగుమమం కానుంది. ఏడాది ప్రారంభంలో కేంద్రీ య సచివాలయం నుంచి మండీహౌస్ మధ్య మెట్రో సేవలు అందుబాటులో రానున్నాయి. ఏడా ది మధ్యలో బాదర్‌పూర్-ఫరీదాబాద్ మధ్య మెట్రోరైలు పరుగులు పెట్టనుంది. ఈ మార్గం అందుబాటులోకి వస్తే లక్షలాది మంది మెట్రో ప్రయాణికులు ఎంతో మేలు కలగనుంది. అదే సమయంలో రాజీవ్‌చౌక్ మెట్రో స్టేషన్‌పై భారం తగ్గుతుంది. మండీహౌస్ స్టేషన్‌ను ఇంటర్‌చేంజ్ పాయింట్‌గా మారుస్తుండడంతో యెల్లోలైన్ నుంచి బ్లూలైన్‌కి ప్రయాణించే వాళ్లు నేరుగా వెళ్లవచ్చు. దీంతో రాజీవ్ చౌక్ స్టేషన్‌లో కాస్త రద్దీ తగ్గనుంది. 
 
 డీఎంఆర్‌సీ ఎండీ మంగూసింగ్ పేర్కొన్న ప్రకారం.. మండీహౌస్-సెంట్రల్ సెక్రెటేరియట్ మధ్య ట్రయల్న్‌న్రు డిసెంబర్ 30 వరకు పూర్తి చేయనున్నారు. మార్చి వరకు ఈ లైన్‌లో పూర్తిస్థాయిలో మెట్రోరైలు సేవలు అందుబాటులోకి తెస్తామన్నా రు. ఇదే ఏడాది జూన్-జూలై వరకు బాదర్‌పూర్-ఫరీదాబాద్ మధ్య మెట్రోసేవలు ప్రారంభం కానున్నాయి. 
 
 ఒక్కసారి మారితే చాలు...
 ఈ లైన్లలో మెట్రోరైలు సేవలు అందుబాటులోకి వస్తే నోయిడా, ఆనంద్‌విహార్-ద్వారక, ఫరిదాబాద్ బాదర్‌పూర్ రూట్‌లో ప్రయాణికులు మండీహౌస్‌లో మారితే సరిపోతుంది. ఇప్పటి వరకు కేంద్రీయ సచివాలయం మెట్రోస్టేషన్ నుంచి రాజీవ్‌చౌక్‌కి వచ్చి అక్కడి నుంచి మెట్రోరైలు మారాల్సి వచ్చేది. ఇందుకోసం 7 నుంచి 10 నిమిషాల సమయం వృథా అయ్యేది.
 
 రాజీవ్‌చౌక్‌పై తగ్గనున్న రద్దీ...
 డీఎంఆర్‌సీ అధికారులు చెబుతున్న ప్రకారం ఫరీదాబాద్-మండీహౌస్ రూట్లను కలిపే రాజీవ్‌చౌక్ స్టేషన్‌తో కలపడంతో రాజీవ్‌చౌక్ మెట్రోస్టేషన్‌పై 20 శాతం రద్దీ తగ్గనుంది. ప్రయాణికులు నేరుగా మండీహౌస్ మెట్రోస్టేషన్‌కు చేరుకోవచ్చు. మండీహౌస్-కశ్మీరీగేట్ మధ్య మెట్రోసేవలు అందుబాటులోకి వస్తే రాజీవ్‌చౌక్ స్టేషన్ రద్దీ మరో 40 శాతం తగ్గుతుంది.
 
మరిన్ని వార్తలు