మాజీ మావోయిస్టు దారుణ హత్య

16 Dec, 2016 11:18 IST|Sakshi
విశాఖపట్నం: జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టును గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమర్చారు. ఈ సంఘటన విశాఖ కాంతిహిల్స్ అటవీ ప్రాంతంలో శుక్రవారం వెలుగుచూసింది. మావోయిస్టు ఇంటిలీజెన్స్ చీఫ్‌గా పని చేసిన టి. అనిల్ అలియాస్ చందు ఏడాదిన్నర క్రితం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కాగా.. గురువారం రాత్రి గుర్తుతెలియని దుండగులు అతనిని దారుణంగా హతమార్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మావోయిస్టులే చందును హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. 
మరిన్ని వార్తలు