ప్రేమ పెళ్లి.. కాదు లవ్‌ జిహాద్‌

12 Jan, 2018 07:41 IST|Sakshi

తుమకూరులో కూతురు వర్సెస్‌ తండ్రి

ప్రేమ వివాహం రగిల్చిన గొడవ

తుమకూరు: రాష్ట్రంలోని కరావళి ప్రాంతంలో సంచలనంగా మారిన లవ్‌ జిహాద్‌ సంఘటనల ప్రభావం తుమకూరుపైనా పడింది. బెంగళూరులో ఐటీ ఇంజినీరుగా ఉద్యోగం చేస్తున్న అమ్మాయి, మైనారిటీ వర్గానికి చెందిన ఆటో డ్రైవర్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇది తట్టుకోలేని ఆమె తండ్రి ఇది లవ్‌ జిహాద్‌ ఘటన అని, తమ కూతురిని బెదిరించి పెళ్లి చేశారని విలపిస్తూ తుమకూరు పోలీసులను  ఆశ్రయించడంతో చర్చనీయాంశమైంది.

వివరాలు.. తుమకూరు తాలూకాలోని కుంకుమనహళ్ళి గ్రామానికి చెందిన చైత్ర (26), అదే గ్రామానికి చెందిన ముస్లిం సాజీద్‌ఖాన్‌ (30)ను ప్రేమించి కొద్దివారాల కిందట వివాహం చేసుకున్నారు. ఒకే గ్రామం కావడంతో వీరిద్దరికి కాస్త పరిచయడం ఉండేది. క్రమంగా స్నేహం బలపడి ప్రేమగా మారింది. ఆమె ఇంట్లో వారిని ఎదిరించి అతని వెంట వెళ్లింది. ఆమె బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు కాగా, సాజిద్‌ కూడా బెంగళూరులోనే ఆటో నడుపుతూ జీవిస్తున్నారు. వీరిద్దరూ బెంగళూరులోనే కాపురం పెట్టారు.

పోలీసులకు తండ్రి ఫిర్యాదు :  చైత్ర తండ్రికి ఈ పెళ్ళి ఎంతమాత్రం ఇష్టం లేదు. ఇది ప్రేమ కాదని, లవ్‌ జిహాద్‌ అని, తమ కూతురిని తమ ఇంటికి పంపించాలని విలపిస్తూ తుమకూరు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆయన, బంధువులు ఫిర్యాదు చేశారు. 

మాది ప్రేమ పెళ్లేనన్న దంపతులు : తండ్రి ఫిర్యాదు నేపథ్యంలో చైత్ర–సాజిద్‌లు రూరల్‌ పీఎస్‌కు వచ్చి తమ వాదన వినిపించారు. తామిద్దరం గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నామని చెప్పారు. ఇద్దరు ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో పెళ్ళి చేసుకున్నామని పోలీసుల ముందు తెలిపారు. దాంతో పోలీసులు విచారణ జరిపి ఇది లవ్‌ జిహాద్‌ కాదని చెప్పారు.

మరిన్ని వార్తలు