నడుపల్లిలో సాకారమైన జాతిపిత ఆశయం

29 Sep, 2014 03:16 IST|Sakshi
  • అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి ఇంటిలోకి దళితుల గృహ ప్రవేశం
  •  సాదరంగా ఆహ్వానించి గౌరవ మర్యాదలు చేసిన ఇంటి యజమాని
  • కోలారు : కులాలు, మతాలు, జాతుల మధ్య అడ్డుగోడలు ఉండరాదనే గాంధీజీ ఆశయం సాకరమైంది. తాలూకాలోని నడుపల్లి గ్రామంలో ఆగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి దళితులను తన ఇంటిలోకి ఆహ్వానించి మనుషులందరిదీ ఒకే కులమని చాటారు. అనాదిగా ఇంటి బయటి నుంచే పలుకరిస్తున్న దళితులను తన ఇంట్లోకి ఆహ్వానించారు. కోలారు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అధ్యక్షుడు క్రిష్ణమూర్తి గ్రామంలో నివాసం ఉంటున్నారు.
     
    ఆదివారం స్థానికంగా ఉన్న  వెంకటేష్, మెణసమ్మ, మునిరత్న దళిత కుటుంబాలను తన ఇంటిలోకి ఆహ్వానించి  వారికి తగిన గౌరవ మర్యాదలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ లా కళాశాల లెక్చరర్ ప్రసన్నకుమారి మాట్లాడుతూ అస్పృశ్యత పట్టణాలలో కంటె గ్రామీణ ప్రాంతాలలోనే అధికంగా ఉందన్నారు. గ్రామీణ స్థాయి నుంచే దీనిని అడ్డుకోవాలన్నారు. దళిత నాయకుడు విజయకుమార్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలకు కమ్యూనిస్టు సిద్దాంతాల పట్ల నమ్మకం ఉన్నవారు ముందుకు రావాల్సి ఉందన్నారు. కానీ   వారు తమ నోటి వెంట దళితులు మా ఇంటికి రండి పిలవలేదని విచారం వ్యక్తం చేశారు.
     

మరిన్ని వార్తలు