ఎరువుల వ్యాపారి దారుణ హత్య

26 Nov, 2016 11:01 IST|Sakshi
బంటుమిల్లి: శివాలయానికి వెళ్లి వస్తున్న ఓ ఎరువల వ్యాపారి దారుణహత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కృష్ణాజిల్లా బంటుమిల్లి మండల కేంద్రంలో శనివారం ఉదయం చోటు చేసుకంది. స్థానికంగా నివాసముంటున్న పబ్బిశెట్టి బద్రినారాయణ(45) ఎరువుల వ్యాపారం చేస్తున్నాడు. ఈ రోజు ఉదయం ద్విచక్రవాహనంపై శివాలయానికి వెళ్లి వస్తుండగా.. ఆంధ్రాబ్యాంకు సెంటర్ గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో నరికి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఆర్థిక లావాదేవీల విషయంలో తలెత్తిన వివాదం వల్లే ఈ దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 
Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు