బెంగళూరులో ఫిల్మ్‌సిటీ

9 Jun, 2014 01:39 IST|Sakshi
 • ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
 •  ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో
 •  ఏర్పాటుకు ముందుకొచ్చే ప్రైవేట్ సంస్థలకు పూర్తి సహకారం
 • సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో చలన చిత్ర పరిశ్రమను మరింత అృవద్ధి చేయడంలో భాగంగా ప్రైవేట్ భాగస్వామ్యంతో బెంగళూరులో ఫిల్మ్‌సిటీని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్ట ంచేశారు. ఫిల్మ్‌సిటీ ఏర్పాటుకు ముందుకు వచ్చే ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం తరుఫున పూర్తి సహకారాన్ని అందించనున్నట్లు చెప్పారు. తన క్యాంప్ కార్యాలయం కష్ణా’లో ఆదివారం ఆయన దక్షిణ బారత చలన చిత్ర వాణిజ్య మండలి, కర్ణాటక చలని చిత్ర వాణిజ్య మండలి ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధు మాట్లాడుతూ.. ప్రభుత్వ సహకారం లేక పోవడం వల్లనే చలన చిత్ర పరిశ్రమ కుదేలవుతోందన్న భావన సరికాదని అన్నారు. చిత్ర పరిశ్రమలకు మల్టీఫ్లెక్స్‌ల వల్ల ఎదురవుతున్న
   
   బెంగళూరులో ఫిల్మ్‌సిటీ
   
   సమస్యలు, ప్రభుత్వం విధిస్తున్న సేవా పన్ను తదితర అంశాల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని హామీనిచ్చారు. రాష్ట్ర సమాచార శాఖా మంత్రి రోషన్ బేగ్ మాట్లాడుతూ..  జిల్లా, తాలూకా కేంద్రాల్లో జనతా థియేటర్ల ఏర్పాటుపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తుందని అన్నారు. మల్లీఫ్లెక్స్‌ల ద్వారా కన్నడ చిత్రాలకు జరుగుతున్న అన్యాయంపై చర్చించేందుకు త్వరలో సీఎం నేృతత్వంలో మల్టీఫ్లెక్స్ యాజమాన్యాలతో సమావేశాన్ని నిర్వహించబోతున్నట్లు చెప్పారు. సమావేశంలో దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు శశికుమార్, ఉపాధ్యక్షుడు బి.విజయ్‌కుమార్, కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు హెచ్.డి.గంగరాజ్, ప్రముఖ నిర్మాత సా.రా.గోవిందు తదితరులు పాల్గొన్నారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు