సాఫ్ట్వేర్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం

30 Sep, 2016 09:08 IST|Sakshi
సాఫ్ట్వేర్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ : బంజారాహిల్స్ రోడ్డు నెం -12 లోని బహుళ అంతస్తుల భవనంలో సాప్ట్వేర్ కార్యాలయంలో శుక్రవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. భద్రత సిబ్బంది వెంటనే స్పందించి... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లలో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది... మంటలార్పుతున్నారు. అయితే ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు భవనం వద్దకు చేరుకున్నారు. బిల్డింగ్లో చిక్కుకున్న శ్రీవిద్య అనే అమ్మాయిని, మరో అబ్బాయిని పోలీసులు రక్షించారు.

మరికొన్ని ఫైరింజన్లు ఘటన స్థలానికి తీసుకు వస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు భవన యజమానులు తీసుకోలేదని పోలీసులు తెలిపారు. ఇదే ఘటన ఉదయం 10 గంటల తర్వాత అయితే నాలుగో అంతస్థులోని ఉద్యోగులు కిందకి రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవలసి వచ్చేదని పోలీసులు తెలిపారు. ఇలాంటి భవన నిర్మించేటప్పుడు నాలుగువైపులా ఫైరింజన్లు తిరిగేలా ఉండాలని... కానీ ఇక్కడ అలాంటి అవకాశమే లేదని పోలీసులు చెప్పారు. అగ్నిప్రమాదంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

 

మరిన్ని వార్తలు