వోల్వో బస్సులో అగ్నిప్రమాదం

22 Apr, 2016 08:31 IST|Sakshi

తప్పిన పెనుప్రమాదం
ప్రమాదం నుంచి సురక్షితంగా బయట పడిన 30 మంది ప్రయాణికులు
 
వేలూరు: ఆంబూరు సమీపంలో వోల్వో బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. ప్రమాదంలో బస్సులో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు సురక్షితంగా బయడపడ్డారు. చైన్నై, కోయంబేడు నుంచి బెంగళూరుకు వెళ్లేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రైవేటు వోల్వో బస్సు బుధవారం రాత్రి 12 గంటల సమయంలో బయలు దేరింది. బస్సు వేలూరు జిల్లా ఆంబూరు సమీపంలోని వడపుదుపేట వద్ద వెళుతుండగా బస్సు మంటలు వచ్చాయి. గాడ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా మంటలు రావడం చూసి కేకలు వేయడంతో బస్సును డ్రైవర్ నిలిపి వేశాడు.
 
వెంటనే ప్రయాణికులు కేకలు వేస్తూ పోటీ పడుతూ కిందకు దిగారు. వెంటనే ఆంబూరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే బస్సు వెనుక వైపు పూర్తిగా కాలి పోయింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు. అనంతరం వారు బెంగళూరుకు మరో బస్సులో వెళ్లారు. వోల్వో బస్సు అగ్నిప్రమాదానికి గురి కావడంతో సుమారు గంట పాటు జాతీయ రహదారిలో ట్రాఫిక్ స్తంభించింది. ఆంబూరు తాలుకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు