రైల్లో మంటలు : పరుగులు తీసిన ప్రయాణికులు

14 Dec, 2016 19:09 IST|Sakshi

గద్వాల: రైల్లో మంటలు చెలరేగిన ఘటన గద్వాల జిల్లా మానవపాడు వద్ద బుధవారం చోటుచేసుకుంది. గుంటూరు నుంచి కాచిగూడ వెళ్తున్న రైలు మానవపాడు వద్దకు చేరుకోగానే రైల్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో భయాందోళనలకు గురైన ప్రయాణికులు రైలు దిగి పరుగులు తీశారు. ఇది గుర్తించిన రైల్వే అధికారులు మానవపాడు రైల్వే స్టేషన్‌లో రైలును నిలిపివేశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు