శునకం కోసం..

13 Feb, 2019 12:05 IST|Sakshi
టెంపో వ్యానులో ప్రచారం

టీ.నగర్‌ ,చెన్నై: కనిపించకుండా పోయిన శునకం ఆచూ కీ తెలపాలంటూ యజమాని ఫ్లెక్సీలు ఏర్పాటుచేశాడు. ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతి అందజేయనున్నట్లు ప్రకటించాడు. కోయంబత్తూరు వడవల్లికి చెందిన దీపక్‌ (45) వ్యాపారం చేస్తుంటారు. ఈయన  ఆరు నెలలుగా శునకాన్ని పెంచుకుంటూ వచ్చాడు. శునకం గత జనవరి 24 నుంచి కనిపించకుండా పోయింది. అనేక చోట్ల గాలించినా ఫలితం లేదు. దీపక్‌ ప్రస్తుతం దీని ఆచూకీ కోసం నగరమంతటా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా ఒక టెంపోలో శునకం ఫొటోతో కూడిన ఫ్లెక్సీ నగరమంతటా సంచరిస్తోంది. శునకం ఆచూకీ తెలిపిన వారికి నగదు అందజేయనున్నట్లు దీపక్‌ తెలిపాడు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు