పొగమంచును ముందే పసిగట్టొచ్చు

7 Feb, 2019 11:47 IST|Sakshi

త్వరలో అందుబాటులోకి రానున్న సాంకేతిక పరిజ్ఞానం

జేఎన్‌సీఏఎస్‌ఆర్‌లో పరిశోధనలు పూర్తి

విమానాలకు తప్పనున్న అంతరాయం

సాక్షి బెంగళూరు: నగర శివారులోని కెంపే గౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సీజన్‌లో పొగమంచు కారణంగా 600 వి మానాలకు అంతరాయం కలిగిందని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. కాగా వచ్చే సీజన్‌లలో విమానాల సంచారానికి అంత రాయం కలగకుండా కొత్త టెక్నాలజీని అం దుబాటులోకి తేనున్నారు. ఈమేరకు జవహర్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌ (జేఎన్‌సీఏఎస్‌ఆర్‌) గత నలభై నెలలుగా పరిశోధన చేసి కనిపెట్టా రు. ఫలితంగా ఐదు నుంచి ఆరు గంటల ముందుగానే పొగమంచు ప్రభావాన్ని.. తీవ్రతను కనిపెట్టవచ్చు. దీంతో విమానాలను ముందుగానే ఆపవచ్చు. ప్రయాణికు లకు ఇబ్బందిఉండదు. వచ్చిన విమానాలు ఆకాశంలో తిరగాల్సిన పనిలేదు.

కాగా జేఎన్‌సీఏఎస్‌ఆర్‌ నివేదికలను బెంగళూరు ఇం టర్‌ నేషనల్‌ ఎయిర్‌పోర్టు లిమిటెడ్‌ (బీఐఏఎల్‌) పరిశీలించింది. ఈమేరకు ఆరు గం టలు ముందుగానే పొగమంచును ఊహించే సాంకేతికతను కనుగొన్నట్లు జేఎన్‌సీఏఎస్‌ఆర్‌ బృందం లీడర్‌ ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. వచ్చే 40 నెలల కాలానికి సరిపడే విధంగా తమ బృందం పరిశోధనలు చేసి పొగమంచును అంచనా వేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. మైక్రో ఫిజిక్స్, రేడియేషన్, రాత్రి ఉష్ణోగ్రతల ఆధారంగా పొగమంచును అంచనా వేస్తున్నట్లు తెలిపారు. వచ్చే మూడు చలికాలాల సీజన్‌లలో రాత్రి ఉష్ణోగ్రతలు తదితర ప్ర మాణాల ఆధారంగా పొగమంచును అంచ నా వేసి విదేశీ ఎయిర్‌పోర్టుల్లోనే మరింత ఆలస్యంగా బయలుదేరేలా సూచించే అవకాశం ఉందన్నారు. పొగమంచు ప్రభావం తగ్గిపోయే సమయం ఆధారంగా విమానాలను ఆహ్వానించవచ్చు. కాగా పొగమంచు నివేదికలు రాత్రి 10 నుంచి 11 గంటల మధ్యలో వివరిస్తారు. మరుసటి రోజు తెల్లవారుజామున వచ్చే విమానాలకు ఉపయోగపడుతుందని అధికారులు వెల్లడించారు.   

మరిన్ని వార్తలు