నూతన సీఐసీగా రాజీవ్ మాథుర్

23 May, 2014 01:17 IST|Sakshi
నూతన సీఐసీగా రాజీవ్ మాథుర్

న్యూఢిల్లీ: కేంద్ర సమాచార కమిషన్  నూతన ప్రధాన సమాచార కమిషనర్‌గా ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ రాజీవ్ మాథుర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆయన చేత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం ప్రమాణం చేయించారు. ఇంతకుముందు సీఐసీగా ఉన్న సుష్మా సింగ్ బుధవారం రాజీనామా చేశారు. కేంద్ర సమాచార కమిషన్‌కు రాజీవ్ ఆరో సీఐసీగా పదవిని స్వీకరించారు.

యూపీ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన మాథుర్ సీఐసీలో సమాచార కమిషనర్‌గా 2012లో నియమితులయ్యారు. ఆయనను ఈ పదవికి ప్రధాని మన్మోహన్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సిఫారసు చేసింది. పదవీ స్వీకారం సందర్భంగా రాజీవ్ మాట్లాడుతూ సీఐసీ వద్ద 14 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఫిర్యాదులను తగ్గించడంతోపాటు సమాచార హక్కు పరిరక్షణకు కృషి చేస్తానన్నారు.

మరిన్ని వార్తలు