పురాతన విగ్రహాలు విక్రయ కేసులో నలుగురు అరెస్టు

12 Mar, 2015 23:15 IST|Sakshi

బెంగళూరు : హోయసాలుల కాలం నాటి ప్రాచీన విగ్రహాలను విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను పశ్చిమవిభాగం కామాక్షిపాళ్య పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. రూ.1 కోటి 50 లక్షల విలువచేసే విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం పై అదనపుపోలీస్ కమిషనర్ అలోక్‌కుమార్ మాట్లాడుతూ పంచలోహ విగ్రహాలను విక్రయిస్తున్న నలుగురు దుండగులు బెంగళూరుకు వచ్చారనే పక్కా సమాచారం అందుకున్న కామాక్షీపాళ్య పోలీసులు మారువేషంలో వెళ్లి కొనుగోలు చేసే వారిగా నటించి నలుగురిని అరెస్ట్ చేశారు. దీనిలో బాగస్వామ్యులైన ఇద్దరు వ్యక్తులు పారిపోయారని వారి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నామని తెలిపారు. కామాక్షిపాళ్య పరిదిలోని సుమనహళ్లి రింగ్‌రోడ్డులో ప్రాచీన కాలం విగ్రహాలు విక్రయిస్తున్న మైసూరు కు చెందిన సుదీర్, యోగేశ్, సురేశ్‌బాబు, మండ్య జిల్లా నాగమంగల కు చెందిన దత్తమూర్తి, అరెస్టు చేసి వారి వద్ద ఉన్న రూ.1 కోటి 50 లక్షల విలువచేసే పంచలోహవిగ్రహాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

వీరి నుంచి స్వాధీనం చేసుకున్న విగ్రహాల్లో 8 కిలోల 400 గ్రాముల బరువుగల 45 సెంటీమీటర్లు ఎత్తుగల పార్వతివిగ్రహం, 2 కిలోల 800 గ్రాముల బరువు గల 23 సెంటీమీర్లు ఎత్తుగల దత్తాత్రేయ విగ్రహం 1 కిలో 5 గ్రాముల బరువు గల సీతరామలక్ష్మణ విగ్రహాలును 9 కిలోల 200 గ్రాముల బరువుగల 20 సెంటీమీటర్లు ఎత్తు గల శంకరాచార్య విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. నిందితుడు సుదీర్ సైబర్‌సెంటర్‌లో పనిచేస్తున్నాడని యోగీశ్‌ట్రేడింగ్ వ్యాపారం, సురేవ్‌బాబు ట్రేడింగ్ బిజనెస్ నిర్వహిస్తున్నారని దత్తమూర్తి వ్యవసాయ చేసేవాడని తెలిపారు. విజయనగర ఉపవిభాగ సహయక పోలీస్ కమిషనర్ ఉమేశ్ నేతృత్వంలో ఇన్స్‌స్పెక్టర్ బాళేగౌడ విగ్రహాలు విక్రయించే దుండగులను అరెస్ట్ చేశారు.
(బనశంకరి)

మరిన్ని వార్తలు