వై ఫై గాలం

27 Apr, 2015 03:56 IST|Sakshi
వై ఫై గాలం

యువత ఓట్లను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ ఎత్తుగడ
నగరం మొత్తం వైఫై ఉచితం చేయాలని యోచన
ప్రాజెక్ట్ సాంకేతిక సలహాదారుగా నందన్ నిలేకనీ

 
సాక్షి, బెంగళూరు : బృహత్ బెంగళూరు మహానగర పాలికె ఎన్నికల్లో విజయం కోసం అధికార కాంగ్రెస్ పార్టీ అన్ని వనరులను వినియోగించుకోనుంది. ఎన్నికలల్లోపు కొన్ని ప్రజాకర్షక పథకాలను ప్రవేశపెట్టి మెజారిటీ సీట్లు గెలుచుకోవాలని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఐటీ,బీటీ రాజధానిగా పేరుగాంచిన బెంగళూరులో  దాదాపు కోటి జనాభా ఉంది. ఇందులో 60  శాతం ఉన్న యువత ఓట్లను ఆకర్షించడంలో భాగంగా నగరం మొత్తానికి ఉచిత వైఫైను ఏర్పాటు చేయాలని సిద్ధరామయ్య ప్రభుత్వం భావిస్తోంది.

నగరంలో ఇప్పటికే బ్రిగెడ్, ఎం.జీ రోడ్డు పరిధిలో ఉచిత వైఫై అందుబాటులో ఉంది. ఈ ఉచిత వైఫై పట్ల యువత నుంచి ఉత్తమ ప్రతిస్పందన వ్యక్తమవుతోంది. దీంతో 800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న బెంగళూరు మొత్తానికి ఉచిత వైఫ్ సదుపాయం కల్పించనుంది. ఒక వ్యక్తి రోజుకు గరిష్టంగా మూడు గంటలు లేదా 50 ఎం.బీ పరిమాణంలో ఉచితంగా వైఫైను అందించాలని ప్రభుత్వం భావన.

ఇందుకు ఏడాదికి దాదాపు రూ.200 కోట్లు ఖర్చుఅవుతుందని ఇప్పటికే ఐటీ,బీటీ శాఖ నుంచి ప్రభుత్వానికి నివేదిక అందిందింది. కాగా, త్వరలో జరగనున్న మంత్రి మండలిలో ఇందుకు అధికారిక అనుమతి లభించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ప్రాజెక్టుకు సాంకేతిక సలహాదారుగా ప్రముఖ ఐటీ దిగ్గజం నందన్‌నిలేఖానిని నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఐటీ, బీటీ శాఖ ఉన్నతశాఖాధికారి ఒకరు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు