నేటి నుంచి సీఈటీ

1 May, 2014 02:11 IST|Sakshi
  •  రాష్ట్ర వ్యాప్తంగా 314 పరీక్ష కేంద్రాలు
  •  పరీక్ష రాయనున్న విద్యార్థులు 1,40,461 మంది
  •  సాక్షి, బెంగళూరు : ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో వైద్య, దంత వైద్య, ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీఈటీ) నేటి (గురువారం) నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. ఇందుకు అవ సరమైన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి చేసినట్లు కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ అధికారులు తెలిపారు. మొత్తం 1,40,461 మంది విద్యార్థులు ఈ ఏడాది సీఈటీ రాయనున్నారు. ఇందులో 36,411 మంది బెంగళూరుకు చెందిన వారు. ఇక సీఈటీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 314 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

    ఇందులో 70 బెంగళూరులోనే ఉన్నాయి. ఇదిలా ఉండగా ప్రవాస కన్నడిగులకు (హొరనాడు, గడినాడు) కన్నడ భాష పరిజ్ఞానంపై నిర్వహించే పరీక్ష ఈనెల 3న ఉదయం 11:30 నుంచి 12:30 గంటల వరకూ నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు మొత్తం 1,660 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికీ హాల్‌టికెట్లు అందని వారితో పాటు సీఈటీకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం www.kea.kar.nic.in, లేదా  080  23568201,23568202,23468205,23461575 లో సంప్రదించవచ్చు.
     

మరిన్ని వార్తలు