స్మార్ట్ సిటీలకు రూ.198 కోట్లు విడుదల

28 Feb, 2017 13:01 IST|Sakshi
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న 6 స్మార్ట్ సిటీలకు నిధులు విడుదలయ్యాయి. మంగళవారం ప్రభుత‍్వం రూ.198 కోట్లు విడుదల చేసింది. ఒక్కో నగరానికి రూ. 33 కోట్ల చొప్పున విడుదల చేశారు. రాష్ట్రంలోని శ్రీకాకుళం, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం లను ప్రభుత‍్వం స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని నిర‍్ణయించిన విషయం విదితమే. వీటికి గాను ఆర్థిక శాఖ నిధులు విడుదల చేసింది.
మరిన్ని వార్తలు