ఎన్‌కౌంటర్లో గ్యాంగ్‌స్టర్ మృతి

25 Oct, 2013 23:35 IST|Sakshi

 సాక్షి,న్యూఢిల్లీ:
 ఎన్నో నేరాలతో ప్రమేయమున్నట్టుగా అనుమానిస్తున్న గ్యాంగ్‌స్టర్ నీతూ దబోడియా ఎలి యాస్ నీతూ దబూధవస్ అలియాస్ సురేంద్ర మాలిక్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్లో మట్టుబెట్టారు. దక్షిణ ఢిల్లీలో గురువారం రాత్రి  జరిగిన ఎన్‌కౌం టర్లో ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ నీతూ గ్యాంగ్‌కు చెందిన ముగ్గురిని హతమార్చింది. ఎన్‌కౌంటర్ లో మరణించినవారిలో నీతూ ముఠా నాయకుడు నీతూ దబోడియా కూడా ఉన్నాడు. పేరుమోసిన కిరాయి హంతకుడిగా పోలీసు రికార్డులకు ఎక్కిన నీతూపై హైడ్‌కానిస్టేబుల్ హత్య కేసు కూడా ఉంది. రామ్‌కిషన్ అనే కానిస్టేబుల్‌ను హత్య చేసిన ఈ ముఠానాయకుడిపై కిడ్నాపింగ్, కాంట్రాక్టు కిల్లింగ్ వంటి 50 కేసులు ఉన్నాయి.
 
 ఇతని కోసం హర్యా నా, ఢిల్లీ పోలీసులు గాలిస్తున్నారు. గత సంవత్స రం కోర్టు నుంచి జైలుకు తీసుకువస్తుండగా నీతూ, అతని సహచరుడు సందీప్ చితానియా నాటకీయ పరిస్థితుల్లో అదృశ్యమయ్యారు. ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లను కట్టేసి వారి తుపాకులను తీసుకుని పారిపోవడం సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి పోలీసులు వారిని పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేశారు. హర్యానా పోలీ సులు మేలో జరిపిన ఎన్‌కౌంటర్లో చితానియా మరణించాడు. నీతూను పట్టించినవారికి లక్ష రూపాయల బహుమతిని ఇస్తామని కూడా ప్రకటించారు.
 
 ఇలా చిక్కాడు..
 వసంత్‌కుంజ్ నుంచి అందిన సమాచారం  మేరకు  పోలీసులు శుక్రవారం రాత్రి నీతూ, అతని ముఠాసభ్యులను పట్టుకునేందుకు వలపన్నారు. రాత్రి 10.30 గంటలకు హయత్ హోటల్ వద్ద తమను చుట్టుముట్టిన పోలీసులపై ఈ ముఠా సభ్యులు కాల్పులు ప్రారంభించారు. దాంతో పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభిచారు. అరగంటసేపు సాగిన కాల్పుల్లో నీతూ ముఠాకు చెందిన ముగ్గురితోపాటు అతడూ మరణించాడని స్పెషల్ సెల్ కమిషనర్ శ్రీవాస్తవ తెలిపారు.. గాయపడిన ముఠాసభ్యులను ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలిస్తుండగా మరణించారని పోలీసులు అంటున్నారు. మృతుల్లో నీతూ ప్రధాన అనుచరుడు ఆలోక్‌గుప్తా కూడా ఉన్నాడు. పెద్ద నేరం చేయడానికి నీతూ ప్యూహం రచిస్తున్నట్లు తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. నీతూ గత నవంబర్‌లో హెడ్ కానిస్టేబుల్ రామ్‌కిషన్‌ను దారుణం గా చంపివేశాడని పోలీసులు అంటున్నారు. కాంజావాలా పోలీసు స్టేష్టన్ వద్ద విధుల్లో ఉన్న రామ్‌కిషన్ నీతూ అతని అనుచరులు ప్రయాణిస్తున్న కారును తనిఖీ కోసం ఆపడానికి ప్రయత్నిచాడు.
 
  వారు కారు ఆపకపోగా అతనిపై కాల్పులు జరిపారు. అయినా రామ్‌కిషన్ కారు తలుపు పట్టుకు వేళాడుతూ వెళ్లాడు. అతణ్ని అలాగే కొన్ని అడుగుల దూరం వరకు లాక్కెళ్లిన నీతూ, అతని అనుచరులు ఆ తరువాత కాల్చిచంపారని పోలీసు లు తెలిపారు. ఫిబ్రవరిలోనూ నీతూ పంజాబ్ పోలీ సుల ఎదురుకాల్పుల నుంచి తప్పించుకుని పారిపోయాడని తెలి పారు. బెదిరించి డబ్బు వసూలు చేయడం ఇతని ప్రధాన లక్ష్యం. ఎన్నడూ మొబైల్‌ఫోన్లను వాడకుండా జాగ్రత్తపడేవాడు. ఎవరిని దోచుకోవాలనేది రాసి పంపేవాడని అంటారు.  
 
 మరో 47 మంది కోసం గాలింపు
 నీతూ మరణించినప్పటికీ ఇతని ముఠాలో పనిచేస్తున్న 47 మంది కోసం గాలింపు కొనసాగుతోందని శ్రీవాత్సవ్ ప్రకటించారు. ఏడాది నుంచి నిఘా వేయడం ద్వారా నీతూ సమాచారాన్ని సేకరించగలిగామన్నారు.
 

మరిన్ని వార్తలు