గంజాయి సాగుపై పోలీసుల దాడులు

30 Nov, 2016 12:54 IST|Sakshi
కోట్‌పల్లి: వికారాబాద్ జిల్లా కోట్‌పల్లి మండలం బార్వాద్ గ్రామంలో భారీ గంజాయి నిల్వలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో గంజాయి సాగు చేస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు, రెవెన్యూ సిబ్బంది బుధవారం దాడులు జరిపి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా గ్రామ శివారులోని పత్తి, కంది పంటల్లో అంతర పంటలుగా గంజాయిని సాగు చేస్తుండటాన్ని గుర్తించిన వాటిని ధ్వంసం చేశారు
మరిన్ని వార్తలు