జార్జ్‌ను బలిపశువు చేస్తున్నారు

16 Jul, 2016 03:16 IST|Sakshi
జార్జ్‌ను బలిపశువు చేస్తున్నారు

జీవవైవిధ్య ఉద్యానవనం ప్రారంభోత్సవంలో సీఎం
 
బెంగళూరు(బనశంకరి) : డీవైఎస్‌పీ గణపతి ఆత్మహత్య వ్యవహారంలో మంత్రి జార్జ్‌కు ఎలాంటి సంబంధం లేదని, అయితే విపక్షాలు తమ స్వార్థం కోసం ఆయన్ను బలిపశువును చేస్తున్నాయని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. నాగవారలోని హెణ్ణూరు చెరువు వద్ద జీవ వైవిధ్య వనాన్ని సీఎం శుక్రవారం  ప్రారంభించి మాట్లాడారు.  99 కేసుల్లో నిందితులు తప్పించుకున్న పర్వాలేదని, అయితే ఓ నిరపరాది శిక్షపడకూడదనే చట్టం ఆశయమని తెలిపారు. అయితే గణపతి ఆత్మహత్య విషయంలో ఎలాంటి సంబంధం లేని జార్జ్‌ని రాజీనామా  చేయాలని కోరడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇప్పటికే విపక్షాలు సంధించిన ప్రశ్నలంటికీ సమాధానమిచ్చామని, విచారణ అనంతరం నిజానిజాలు వెలుగులోకి వస్తామన్నారు.

ప్రారంభించిన ఉద్యానవనానికి బసవలింగప్ప ఉద్యానవనంగా పేరుపెట్టామన్నారు. గతంలో అటవీశాఖామంత్రిగా ఉన్న బసవలింగప్ప ఈ ప్రదేశాన్ని రక్షించారని గుర్తు చేశారు. బెంగళూరు నగరం సౌందర్యం పెంచడానికి చెరువులు, ఉద్యానవనాలను అభివృద్ధి చేస్తామన్నారు.  కబ్జాకు గురైన చెరువులు, ప్రభుత్వ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంద ని తెలిపారు. హెణ్ణూరు చెరువు 34 ఎకరాల విస్తీర్ణం ఉందని దీనిని ఆదర్శ ఉద్యానవనంగా తీర్చిదిద్దుతామన్నారు. 21 శాతం ఉన్న అటవీ ప్రాంతాన్ని 33 శాతానికి పెంచే అవసరముందన్నారు.  నగరాబివృద్ధి శాఖామంత్రి కేజే.జార్జ్  మాట్లాడుతూ.....గణపతి ఆత్మహత్య విషయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. అటవీశాఖమంత్రి రామనాథ రై, మేయర్ మంజునాథరెడ్డి, ఎమ్మెల్యే బీఏ.బసవరాజు, పరిసరాల మాలిన్య నియంత్రణ మండలి అద్యక్షుడు లక్ష్మణ్, ప్రభుత్వ కార్యదర్శి విజయభాస్కర్, బీబీఎంపీ సభ్యులు ఆనంద్, రాదమ్మవెంకటేశ్, ఎస్‌జీ.నాగరాజ్, కాంగ్రేస్ నేతలు సునీల్‌కుమార్, సొణప్ప, జగదీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.                                                         
 
 

మరిన్ని వార్తలు