సెకండ్‌ షో అని చెప్పి.. అఘాయిత్యం

7 Jan, 2017 10:15 IST|Sakshi

రాజవమ్మంగి: సెకండ్‌ షో సినిమాకని నమ్మించి తీసుకెళ్లి మైనర్‌ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. జిల్లాలోని రాజవమ్మంగి శివారు కన్నయ్యమ్మపేటకు చెందిన లోవరాజు(21) ఇంటి సమీపంలోని ఓ బాలికను(12) శుక్రవారం సెకండ్‌ షో సినిమాకు తీసుకెళ్లాడు. సినిమా మధ్యలోనే పని ఉంది త్వరగా ఇంటికెళ్లాలని బాలికతో చెప్పాడు. దీనికి సరెనన్న బాలికను ఇంటికి తిరిగి తీసుకొస్తూ.. ఆమె పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. భయాందోళనకు గురైన బాలిక ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చింది.

తల్లిదండ్రులు ఏం జరిగిందని ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. ఈ విషయం పై అర్ధరాత్రి బాధితురాలి తల్లిదండ్రులు రాజవమ్మంగి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలికను చికిత్స నిమిత్తం సమీపంలోని పీహెచ్‌సీకి తరలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి ఇదివరకే పెళ్లి అయినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు