ప్రమాదకర స్థాయిలో గోదావరి..

30 Jul, 2019 13:16 IST|Sakshi

మంబై : మహారాష్ట్రలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. నాశిక్‌లో గోదావరి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరికి భారీగా వరద పోటెత్తింది. అంతేకాకుండా సోమవారం మహారాష్ట్ర జలవనరుల శాఖ గంగాపూర్‌ డ్యామ్‌ నుంచి 1,000 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలింది. దీంతో నాశిక్‌ వద్ద గోదావరి ఉధృతి ప్రమాదకరస్థాయికి చేరింది. గంగాపూర్‌ నుంచి గోదావరిలోకి నీరు వదిలే సమయంలో నది ఒడ్డుకు సమీపంలోని కాలనీల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కాగా, జూలై ప్రారంభం నుంచి మహారాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ముంబైలో ఇప్పటివరకు దాదాపు 1200 మి.మీ వర్షపాతం నమోదైంది.

మరిన్ని వార్తలు