ప్రభుత్వ పనితీరు బాగుంది

7 Feb, 2017 04:14 IST|Sakshi
ప్రభుత్వ పనితీరు బాగుంది

17 దేశాల ప్రతినిధులు కితాబు

సిద్దిపేట రూరల్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పని తీరు చాలా బాగుందని 17 దేశాలకు చెందిన ప్రతి నిధులు ప్రశంసించారు. తమ దేశాల కంటే.. ఇక్కడే అభివృద్ధి బాగా జరుగుతోందని చెప్పారు. సోమ వారం ఎన్‌ఐఆర్డీ సహకారంతో సీడబ్ల్యూసీ ప్రతినిధులు డాక్టర్‌ రజినీకాంత్, అనురాధల ఆధ్వర్యంలో బంగ్లాదేశ్, భూటాన్, క్యామరూన్, బురుండి, కొలంబియా, ఫిజి, ఘణ, మడగస్కార్, మయన్మార్, శ్రీలంక, సుడాన్, శైర్యా, తునిస్యా, టన్జానియా, ఉజ్బెకిస్థాన్, జాంబియా, అఫ్ఘానిస్థాన్‌.. దేశాల ప్రతినిధులు సిద్దిపేట జిల్లా మిట్టపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టిన ఉపాధి హామీ, ఆసరా పింఛన్లు, మిషన్‌కాకతీయ, భగీరథ, ఇంటింటికీ మరుగుదొడ్ల నిర్మాణం, ఇంకుడు గుంతల నిర్మాణం, గ్రామంలోని సీసీ రోడ్లు, డంప్‌ యార్డుల నిర్మాణాలను, హాస్టళ్లల్లో, అంగన్‌వాడీల్లో విద్యార్థులకు సన్నబియ్యం, వాటర్‌ప్లాంట్ల ద్వారా సురక్షితమైన తాగునీరు ప్రజలు వినియోగిం చుకుంటున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

అనంతరం విదేశీ ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామంలో ఎంజీఎన్‌ఆర్‌ ఈజీఎస్‌ పని బాగుందని, ఇందులో కూలీలు, రైతులు లబ్ధి పొందుతున్న తీరు ఆదర్శంగా ఉందన్నారు. పేద ప్రజలు అభివృద్ధి చెందే విధంగా పథకాలు అమలు జరుగుతున్నట్లు తెలిపారు. ఇంటింటికీ మరుగుదొడ్ల నిర్మాణంతో అభివృద్ధి వైపు అడుగులు వేస్తామని.. అలాగే ఇంకుడు గుంతలతో ఎంతో ఉపయో గాలు ఉంటాయన్నారు. విద్యార్థులకు అందుతున్న విద్య, భోజన కార్యక్రమం బాగుందని ప్రశంసించారు. అనంతరం గ్రామంలో నిర్వ హించిన బతుకమ్మ ఆటలో పాల్గొన్నారు. గ్రామస్తులతో కలసి కోలాటం వేశారు.

మరిన్ని వార్తలు