44 కోట్ల మందికి గృహాలు

3 Jan, 2017 03:32 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి 44 కోట్ల మందికి సొంతిల్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంటితోపాటు ఎల్పీజీ, కరెంటు, నీటి కనెక్షన్లు కూడా ఇవ్వాలని భావిస్తోంది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) కింద మైదాన ప్రాంతాల్లోని లబ్ధిదారులకు రూ.1.30 లక్షలు, కొండప్రాంతాల్లోని వారికి రూ.1.50 లక్షలను ప్రభుత్వం నేరుగా బదిలీ చేస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కార్యదర్శి అమర్జీత్‌ సిన్హా చెప్పారు. దీంతోపాటు మరుగుదొడ్ల నిర్మాణం కోసం రూ.12 వేలు అదనంగా ఇస్తామన్నారు.

సొంతింటి నిర్మాణం కోసం లబ్ధిదారులకు రూ.18 వేలు ప్రయోజనం కలిగేలా ఉపాధి హామీ పథకం కింద 90 రోజుల పనిదినాలు కల్పిస్తామని తెలిపారు. తొలుత 33 కోట్ల ఇల్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ దీన్నిప్పుడు 44 కోట్లకు పెంచామన్నారు. ఆవాసాలు లేనివారికి ఇల్లు కట్టించడమే ప్రభుత్వ లక్ష్యమని, తాత్కాలిక గృహాల్లో నివసించేవారికి పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. లబ్ధిదారుల్లో 60% మంది ఎస్సీ, ఎస్టీలు ఉండేలా చూస్తున్నా రు. నిధులు లబ్ధిదారుల ఖాతాల్లోకి మూడేళ్లలోగా జమ అవుతాయని చెప్పారు.

మరిన్ని వార్తలు