త్వరలో కాలుష్య రహిత బస్సులు

23 Apr, 2015 01:06 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా ప్రైవేటు వాహనాలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావి స్తోంది. ఇందులో భాగంగా అత్యాధునికమైన కాలుష్య రహిత బస్సులను ప్రవేశపెట్టనుంది. నగరంలోని ప్రయాణికుల సౌకర్యార్థం ఈ అత్యాధునిక బస్సులను త్వరలో రవాణా విభాగంలోకి తీసుకురావాలని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పట్టుదలతో ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఎర్త్ డే సందర్భంగా బుధవారం ఢిల్లీ విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రసంగించారు.
 
  ఆయన మాట్లాడుతూ ఢిల్లీని క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉంచేం దుకు విస్తృత ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు కూడా ఇందు లో భాగస్వాములు కావాలని పిలుపుని చ్చారు. దీపావళి మందు సామాగ్రికి దూరంగా ఉండాలని కోరారు. అంతే కాకుండా ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా కాలుష్య రహిత బస్సులను ప్రవేశ పెట్టనున్నట్లు పేర్కొన్నారు. తద్వారా ప్రైవేట్ వాహనాలను వినియోగించే వారి సంఖ్యను తగ్గిం చేందుకు యత్నిస్తామని చెప్పారు. నగరా న్ని ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి గట్టెక్కిం చేందుకు విద్యార్థులు కూడా కృషి చేయాలని కోరారు.
 
 ప్రభుత్వ ప్రజా రవాణా వాహనాలను వినియోగించాలని తమ తల్లిదండ్రులకు సూచించాలని విద్యార్థుల కు చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఆప్ ప్రభుత్వం పట్టుదలతో ఉందన్నారు. దీని కోసం వాతావరణ మార్పులు, ట్రాఫిక్ ఇబ్బందులు, వాయు, నీటి కాలుష్యం, శానిటేషన్, పచ్చదనం, ఇంధన వనరులపై చర్చా గోష్టి నిర్వహించడం ద్వారా పరిష్కారాలు కనుగొంటామని తెలిపారు.  ఎర్త్ డే సందర్భంగా ఎకో క్లబ్ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన చిత్రలేఖనం పోటీలో విజేతలకు రాష్ట్ర పర్యావరణ మంత్రి అసీం అహ్మద్ ఖాన్ బహుమతులు అందజేశారు.
 

>
మరిన్ని వార్తలు