గాలిలో ఆడిటోరియం

15 Oct, 2016 14:51 IST|Sakshi
గాలిలో ఆడిటోరియం
 ఈదురుగాలులకు ధ్వంసం
 ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో నైపుణ్య శిక్షణకు ఇబ్బందులు
 నిధులిస్తేనే నిలుస్తది
 కలెక్టర్ కనికరిస్తేనే విద్యార్థుల కష్టాలు దూరం
 
కమాన్‌చౌరస్తా : ఇటీవల వర్షబీభత్సానికి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలోని ఆడిటోరియం పైకప్పు శిథిలావస్థకు చేరింది. అందులోని కొంతభాగం కూలింది. కళాశాలలో విద్యార్థినులు అధికంగా ఉండడంతో సమావేశాలు, శిక్షణ తరగతులు ఆ భవనంలోనే నిర్వహిస్తున్నారు. అసౌకర్యాల మధ్య విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే శిక్షణ తరగతులకు హాజరవుతున్నారు. అప్పటి కలెక్టర్ నీతూప్రసాద్ కొత్త ఆడిటోరియం నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అరుుతే అంచనాల వద్దే నిలిచిపోరుుంది. ఒక్క అడుగు ముందుకు పడలేదు. ప్రస్తుత కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ప్రజాప్రతినిధులు దృష్టిసారిస్తే ఇబ్బందులు దూరంకానున్నారుు. 
 
కెరీర్ గెడైన్స్ కీలకం
మహిళలకు ప్రత్యేక కళాశాల అవడంతో చాలా మంది విద్యార్థినిలు ఇందులో ప్రవేశాలు తీసుకుంటున్నారు. పట్టణ విద్యార్థులతో పోల్చుకుంటే జిల్లావ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థినిలే ఎక్కువగా ఇక్కడ ప్రవేశం పొందుతున్నారు. వీరికి నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తేనే రాణించే అవకాశాలు ఉంటాయి. కెరీర్ గెడైన్స్ తరగతులు కూడా ఏటా కళాశాలలో నిర్వహిస్తున్నారు. సెమినార్స్, గెస్ట్‌లెక్చర్‌తోపాటు పలు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. పలు ఉద్యోగ సాధనకు కావాల్సిన అన్ని విషయాలు ఇందులో నేర్పిస్తుంటారు. విద్యార్థులు వేల సంఖ్యలో ఉండడంతో చిన్న గది సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. 
 
కొత్తదీ అవసరమే
ప్రస్తుతం కూలిన ఆడిటోరియం సామర్థ్యం 200 విద్యార్థులకు మాత్రమే సరిపోయేది. కానీ కళాశాలలో డిగ్రీ, పీజీ విద్యార్థులు 2542 మంది ఉంటారు. ప్రత్యేక తరగతులకు దాదాపు వందల సంఖ్యలో విద్యార్థులు హాజరవుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఆడిటోరియం పైకప్పు కూలడంతో చిన్నపాటి సమావేశాలు సైతం నిర్వహించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. అసలే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు తగ్గుతున్న సమయంలో ఇలాంటి సమస్యలు మంచిది కాదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
 
అంచనాల వద్దే బ్రేక్
ఆడిటోరియం కూలిన సమయంలో దాని మరమ్మతుకు రూ.2.5కోట్ల అంచనాలతో కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ప్రభుత్వం తరఫున అంచనాలు తయూరు చేయూలని అప్పటి కలెక్టర్ నీతూప్రసాద్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈక్రమంలో జిల్లాల పునర్విభజనతో ఆమె బదిలీపై వెళ్లారు. దీంతో ఆ ప్రక్రియ అక్కడితో నిలిచిపోరుుంది. సెప్టెంబర్ 19న కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ సైతం వినతిపత్రం ఇచ్చారు. ఆయన సానుకూలంగా స్పందించినట్లు ప్రిన్సిపాల్ లక్ష్మి తెలిపారు. 
 
ఆడిటోరియం లేదు
గతంలో ఉన్న ఆడిటోరియం ఈదురుగాలులకు కూలింది. ప్రస్తుతం ఏ సమావేశాలు, శిక్షణ తరగతులైన ఇరుకు గదుల్లోనే జరగడంతో అందరు హాజరుకాలేకపోతున్నారు. కనీసం 2 వేల మందికి సరిపోయేలా ఆడిటోరియం నిర్మించాలి. 
 - రమ్య, డిగ్రీ విద్యార్థిని
 
నూతన భవనం కావాలి
కళాశాలలోని ఆడిటోరియం పైకప్పు ఈదురుగాలులకు కూలిపోయింది. పాత ఆడిటోరియంలో 200 మంది మాత్రమే కూర్చునే వీలుంది. కళాశాలలో విద్యార్థులు వేల సంఖ్యలో ఉండడంతో సరిపోవడం లేదు. కనీసం 2వేల మంది కూర్చునేల ఆడిటోరియం నిర్మించాలి. పాతదానికి మరమ్మతు చేసి కొత్తది నిర్మించాలి.  
 - టి.శ్రీలక్ష్మి ప్రభుత్వ, మహిళా డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్
>
మరిన్ని వార్తలు