కొనుగోలు దిగులు!

20 Oct, 2016 14:11 IST|Sakshi
కొనుగోలు దిగులు!
చేతికొచ్చిన పంటలు
ఆలస్యమవుతున్న కొనుగోళ్లు
ఆందోళనలో అన్నదాతలు
పత్తికి 5 సీసీఐ కేంద్రాలు ఖరారు
దీపావళి నుంచి కొనే అవకాశం
‘వరి’కి ఖరారు కాని తేదీలు..
సోయా విషయంలోనూ సందిగ్ధం
మార్క్‌ఫెడ్‌ ద్వారా మొక్కజొన్న..
 
ఆరుగాలం కష్టించి చేతికి వస్తున్న పంటలను చూసి రైతన్నలు మురిసిపోతున్నారు. కానీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో దిన దినం ఆవేదన చెందుతున్నారు. దీపావళి ముందు రైతు ఇంట కాంతులు వెదజల్లాల్సిన సమయంలో ప్రభుత్వం నుంచి కొనుగోళ్లపై స్పష్టత రాకపోవడంతో దిగాలు పడుతున్నారు. పత్తి, సోయా, వరి పంటలు ఎవరు కొనుగోలు చేస్తారు.. వాటి మద్దతు ధర ఎంత.. కేంద్రాలు ఎక్కడెక్కడ అనేవి పూర్తిగా తెలియకున్నా కనీసం కొనుగోలు తేదీలపై కూడా నిర్ణయం వెలువడకపోవడం రైతుల్ని కలవరానికి గురిచేస్తోంది. 
                    
సాక్షి, నిర్మల్‌ : రెండేళ్లుగా సరైన పంటలు రాక పూర్తిగా నష్టపోయిన రైతన్నకు ఈ ఖరీఫ్‌లో కూడా భారీ వర్షాలు కురవడంతో పంట నష్టం సంభవిం చింది. గుడ్డిలో మెల్లలాగా చేతికి అందిన పం టను నమ్ముకోవడం ద్వారా దీపావళి పండుగ సంబురాలు, రబీకి పెట్టుబడుల కోసం రైతన్నకు ఇప్పుడు పైసాల అవసరం ఏర్పడింది. పంటల వారీగా పరిస్థితి ఇలా ఉంది.
 
పత్తి...
నిర్మల్‌ జిల్లాలో 51 వేల 657 హెక్టార్లలో పత్తి సాగువుతుందని అంచన వేయగా 72 వేల 420 హెక్టార్లలో సాగైంది. 7 లక్షల 74 వేల 855 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. గతేడాది 6 లక్షల 85 వేల 674 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం మార్కెటింగ్‌ సీజన్‌ 2016–17కు పత్తి మద్దతు ధర రూ.4,160(పొడవు పింజ రకం) ధర ప్రకటించింది. ప్రస్తుతం వరంగల్‌ మార్కెట్‌లో ప్రైవేట్‌ ట్రేడర్స్‌ క్వింటాలుకు రూ.5,100 ధర చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీసీఐ కొనుగోలుకు రంగంలోకి దిగేది అనుమానంగా కనిపిస్తోంది. ప్రైవేట్‌ ట్రేడర్స్‌ కొనుగోలు చేసే అవకాశం ఉంది. పత్తి తేమ ఆధారంగా ట్రేడర్స్‌ ధరలో కోత పెట్టే అవకాశం ఉండడంతో రైతు లు ఆవేదన చెందుతున్నారు. సీసీఐ కూడా రం గంలో నిలిచి ప్రైవేట్‌ ట్రేడర్స్‌కు పోటీగా కొనుగోలు చేసిన పక్షంలోనే రైతులకు న్యాయం జ రుగుతుందని ఆశిస్తున్నారు. భైంసా, నిర్మల్, సారంగాపూర్, కడెం, కుభీర్‌లలో పత్తి కొనుగో లు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రానికి జతపర్చిబడిన మండలాల రైతులు వెళ్లవలసి ఉంటుంది. సీసీఐ చెల్లింపులన్నీ ఆన్‌లైన్‌లో రైతు బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు.
 
వరి...
వరి ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 18 వేల 931 హెక్టార్ల లో సాగైంది. లక్షా 04 వేల 121 క్వింటాళ్ల దిగుబడి రావచ్చని అంచనా వేస్తున్నారు. ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్, ఐటీడీఏ ప్రొక్యూరింగ్‌ ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఐకేపీ 53, పీఏసీఎస్‌ 26, డీసీఎంఎస్‌ 16, ఐటీడీఏ 7 కేంద్రాల్లో కొనుగోలు చేయనుంది. వారం పదిరోజులలో కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు డీఎం పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. వరి మద్దతు ధర గ్రేడ్‌ 1కు రూ.1,510, సాధారణ రకం రూ.1,470 క్వింటాలుకు నిర్ణయించారు. ఇటీవల జరిగిన సమావేశంలో డీఎం పౌరసరఫరాల శాఖ అధికారులు గన్నీ బ్యాగులు, టార్ఫాలిన్లు, తేమ కొలిచే , తూకం యంత్రాల కోసం ప్రతిపాదనలు చేశారు. 6 లక్షల 13 వేల 855 కొత్త గన్నీ బ్యాగులు, 57 వేల 607 పాత గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. టార్ఫాలిన్లు ఒక్కో సెంటర్‌కు 40 చొప్పున అవసరం కాగా.. 6,800లకు గానూ 3,548 అందుబాటు లో ఉన్నాయని, మరో 3,252 అవసరం అని పే ర్కొంటున్నారు. తేమ కొలిచే యంత్రాలు సెం టర్‌కు రెండు చొప్పున మొత్తం 340 అవస రం కాగా 130 అందుబాటులో ఉన్నాయి. మ రో 210 సమకూర్చుకోవాల్సి ఉంది. తూకం కొలిచే యంత్రాలు సెంటర్‌కు రెండు చొప్పున 340 అవసరం కాగా 131 అందుబాటులో ఉ న్నాయని, మరో 209 అవసరమని వివరించా రు. అకాల వర్షాలు కురిసిన పక్షంలో మార్కెట్‌ కు తీసుకువచ్చిన పంటలు తడిసిపోయి రైతు లు నష్టపోయే పరిస్థితి ఉంది. గతంలో ఇలాం టి అనుభావాలు ఉన్నాయి. వాటి నుంచి అధికారులు పాఠం నేర్చి రైతులు నష్టపోకుండా అన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
 
సోయా...
సోయా పంట సాధారణ విస్తీర్ణం 28 వేల 587 హెక్టార్లు కాగా.. 51 వేల 119 హెక్టార్లలో సాగైంది. 71 వేల 567 మెట్రిక్‌ టన్నులు(7లక్ష ల 15వేల 670 క్వింటాళ్లు) దిగుబడి రావచ్చని అంచనా వేస్తున్నారు. ఆయిల్‌ ఫెడ్‌ ద్వారా సో యా కొనుగోలు చేయాలని నిర్ణయించారు. కు భీర్, భైంసా, సారంగాపూర్‌లలో కొనుగోలు కేంద్రాల కోసం జాయింట్‌ కలెక్టర్‌ ద్వారా రా ష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రెటరీకి ప్రతిపాదనలు పంపా రు. ఇప్పటికే మార్కెట్‌లోకి పెద్ద ఎత్తున సో యా నిల్వలను రైతులు తీసుకువస్తున్నారు. కొ నుగోలు కేంద్రాలు లేకపోవడంతో ప్రైవేట్‌ వ్యాపారులకు తక్కువ ధరకే విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆ దుకోవాలని కోరుతున్నారు. సోయాబిన్‌ మద్ద తు ధర క్వింటాలుకు పసుపుపచ్చ రకానికి రూ.2,675, నలుపు రకానికి రూ.2,625 ఉం ది. కానీ వ్యాపారులు రూ.2,300 చెల్లిస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆ యిల్‌ ఫెడ్‌ వెంటనే రంగంలోకి దిగి మద్దతు ధరకు కొనాలని రైతులు కోరుతున్నారు.
 
మొక్కజొన్న...
మొక్కజొన్న ఈ ఏడాది 9,878 హెక్టార్లలో సాగైంది. ఒక హెక్టారుకు 40 క్వింటాళ్ల చొప్పున 3 లక్షల 95 వేల 120 క్వింటాళ్లు దిగుబడి రావచ్చని అంచనా వేస్తున్నారు. మద్దతు ధర రూ.1,365 నిర్ణయించారు. మార్కెట్‌లో మొన్నటి వరకు రూ.1,800 పైబడి పలికిన ధరను వ్యాపారులు కుమ్మక్కై వరంగల్, నిజామాబాద్‌ మార్కెట్లలో రూ.14,00 లోపు ఇవ్వడంతో ఈ సోమవారం ఆయా మార్కెట్‌ యార్డుల్లో రైతులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. మార్క్‌ఫెడ్‌ ద్వారా సారంగాపూర్, నిర్మల్, మామడ, లక్ష్మణచాంద, వడ్యాల్, ఖానాపూర్‌లలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మొక్కజొన్న కొనుగోలు చేయాలని నిర్ణయించారు. మంగళవారం ఖానాపూర్‌లో కొనుగోళ్లను ప్రారంభించారు. సారంగాపూర్, నిర్మల్‌లో బుధవారం, లక్ష్మణచాంద, వడ్యాల్, మామడల్లో గురువారం కొనుగోళ్లు ప్రారంభిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. టార్ఫాలిన్లు అవసరం మేరకు ఉన్నాయని మార్క్‌ఫెడ్‌ అధికారులు పేర్కొంటున్నారు. నిర్మల్‌లో గోదాంను ఏర్పాటు చేయనున్నట్లు వివరిస్తున్నారు.
 
అన్ని సౌకర్యాలు కల్పిస్తాం
పంట నిల్వలను విక్రయించేందుకు మార్కెట్‌ యార్డుకు తీసుకువచ్చే రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. నాణ్యమైన పంటలను తీసుకువచ్చి రైతులు గిట్టుబాటు ధరను పొందాలి. టార్పాలిన్లు, తేమ కొలిచే యంత్రాలు, తూకం చేసే యంత్రాలు, గన్నీ బ్యాగులు మార్కెట్‌ యార్డుల్లో అందుబాటులో ఉంచుతాం. కొనుగోళ్ల ప్రక్రియలో ఎలాంటి ఆంటకాలు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటాం.          
  – టి.శ్రీనివాస్‌ జిల్లా మార్కెటింగ్‌ అధికారి 
 
 
మరిన్ని వార్తలు