ఘనంగా గణేశోత్సవాలు

13 Sep, 2013 00:16 IST|Sakshi
వర్సోవా, న్యూస్‌లైన్: పశ్చిమ ఖార్‌లోని తెలుగు మిత్ర మండలి ఆధ్వర్యంలో 1988 నుంచి 26 ఏళ్లుగా గణేశోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.  ఈ ఏడాది ఆరు అడుగుల గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించి, మండపాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. రోజూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నట్లు మండలి అధ్యక్షుడు కె.నర్సయ్య, ఉపాధ్యక్షుడు సోమయ్య తెలిపారు. ఏడు రోజుల పాటు పూజలు నిర్వహించిన అనంతరం మాహిమ్ చౌపాటి వద్ద నిమజ్జనం చేయనున్నట్లు పోతుల రాములు తెలిపారు. ఈ సందర్భంగా భారీ ఊరేగింపు తీస్తామని చెప్పారు. ఉత్సవాల్లో మండలి సభ్యులు కె.బాబు, కె.లింగయ్య, సీహెచ్.శ్రీరామ్, బి.చంద్రయ్య, జె.యాకోబు తదితరులు సహాయ సహకారాలు అందిస్తున్నారు.
 
 పశ్చిమ బోరివలిలో..
 బోరివలి, న్యూస్‌లైన్: పశ్చిమ బోరివలి ఎక్మర్ డోంగ్రీ ప్రాంతంలో తెలుగు జన శ్రీ గణేశ్‌మండలి ఆధ్వర్యంలో స్థానిక తెలుగు ప్రజలు గణేశోత్సవాలను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఇక్కడ ఏడు అడుగుల గణనాథుని విగ్రహం ప్రతిష్టించి నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు. స్థానికంగా తెలంగాణకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇతర ప్రాంతాలవాసులు కూడా వచ్చి దర్శించుకుంటున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 15న సత్యనారాయణ మహాపూజా కార్యక్రమం నిర్వహించనున్నామని మండలి అధ్యక్షుడు ఎల్లదరి కనకయ్య తెలిపారు. మరుసటిరోజు గోరాయి బీచ్‌లో నిమజ్జనం చేయనున్నామన్నారు. ఈ ఉత్సవాల్లో మండలి కార్యదర్శులు పలికొండ సతీష్, ఎ.శేఖర్, జాంపెల్లి గోపాల్ తదితరులు పాల్గొంటున్నారు.
 శింపోలి శివాజీనగర్‌లో...
 
 పశ్చిమ బోరివలిలోని శింపోలి శివాజీనగర్‌లో ఉన్న దుర్గాధామ్‌లో శ్రీ గంగపుత్ర తెలుగు మిత్ర మండలి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.ఈ ప్రాంతంలో తెలంగాణకు చెందిన వారు వందల సంఖ్యలో నివసిస్తున్నారు. వీరంతా కలిసి గత ఏడేళ్లుగా కేవలం తెలుగు ప్రజల నుంచి మాత్రమే చందాలు వసూలు చేసి గణపతిని ప్రతిష్టిస్తున్నారు. మండపంలో రంగురంగుల విద్యుద్దీపాలు అలంకరించారు. ప్రతిరోజూ హారతి, భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మండలి అధ్యక్షుడు పడిగెల శ్రీను, ప్రధాన కార్యదర్శి మల్లేశ్ దువ్వాక, కార్యదర్శి మహేశ్ కోళి, కోశాధికారి బాబు, మిస్సల్, సిలివేరి మహేశ్, సునీల్ హరిజన్, మతులపురం తిరుపతి, వీరేశ్ స్వామి తదితరులు తెలిపారు.
మరిన్ని వార్తలు