కన్నుల పండువగా బతుకమ్మ పండుగ

13 Oct, 2013 23:27 IST|Sakshi
ముంబై/భివండీ, న్యూస్‌లైన్: సాక్షి, ముంబై: తెలంగాణ సంప్రదాయ ఉత్సవాల్లో భాగంగా చెప్పుకునే బతుకమ్మ పండుగను స్థానిక తెలుగువారు ఘనంగా జరుపుకున్నారు. ‘ఆధునికత’ను ఈ ఒక్కరోజుకు పక్కనబెట్టి సంప్రదాయ దుస్తులైన పట్టుచీర, పరికిణిలతో తెలుగుతనం ఉట్టిపడేలా ముస్తాబై వచ్చి ఉత్సవాల్లో పాల్గొన్నారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలను అం దమైన ముగ్గుల మధ్య ఉంచి చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలను పాడారు. లయబద్దంగా పాట లు పాడుతూ, అందుకు అనుగుణంగా అడుగులు కలుపుతూ బతుకమ్మ ఆడారు. 
 
 భివండీలో...
 తెలుగు ప్రజలు అధికంగా నివసించే ప్రాంతాల్లో  బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి సద్దుల బతుకమ్మను ఆట పాటలతో  ఘనంగా జరుపుకున్నారు. బతుకమ్మలను అందంగా తీర్చిదిద్దన వారికి స్థానిక వివిధ సేవాసంస్థలు సత్కరించి బహుమతులను అందజేశాయి. బతుకమ్మ  నిమజ్జన ఘాట్ల వద్ద ప్రత్యేక స్వాగత వేదికలను ఏర్పాటు చేసి అల్పాహారాలు, మంచినీటిని అందజేశారు. తెలుగువారు అత్యధికంగా నివసించే పద్మనగర్, కామత్‌ఘర్, బాలాజీ నగర్, నయీబస్తి, పాంజలాపూర్, అంజూ ర్‌పాట, కరోలి ప్రాంతాల్లోని మహిళలు శుక్రవారం నుంచే సద్దుల బతుకమ్మ వేడుక కోసం వివిధ రకాల రంగురంగుల పూలను సేకరించారు.
 
 పూల వ్యాపారులు పూల ధరలు రెట్టింపు చేసినప్పటికీ మహిళలు వెనుకాడకుండా  వివిధ రకాల పూలతో దేవి రూపాన్ని, కలశం, వేంకటేశ్వర విగ్రహం, లిం గం తదితర  రూపాలతో బతుకమ్మలను తయారు చేశారు. ఇదిలాఉండగా స్వాభిమాన్ సేవా సంస్థ సంస్థాపకులు సంతోష్ ఎమ్. శెట్టి.. వరాలదేవి ఘా ట్ వద్ద ప్రత్యేక స్వాగత వేదిక ఏర్పాటు చేసి భక్తులకు అల్పాహారాలు అందజేశారు. అందంగా బతుకమ్మను తయారుచేసిన వారికి సంతోష్‌శెట్టి ఆకర్షణీయమైన బహుమతులను, వెండి కానుకలు అందజేశారు. ఎంజేఎం ఫౌండేషన్ సంస్థాపకులు మురళి మచ్చ పద్మనగర్‌లోని పలు ప్రాంతాల్లో నిర్వహించి న బతుకమ్మ బృందాల ఆడపడుచులకు కానుకలు గా చీరలను పంపిణి చేశారు. వరాలదేవి ఘాట్ వద్ద ప్రత్యేక స్వాగత వేదిక ఏర్పాటు చేసి ఆకర్షణీయమైన బతుకమ్మలకు కానుకలు అందజేశారు.
 
 భక్తులకు అల్పాహారాలు అందజేశారు. సంతోశ్ ఎం. శెట్టి వరాలదేవి ఘాట్ వద్ద టీవీలో ప్రత్యేక్ష ప్రసారా లు నిర్వహించారు. అఖిల పద్మశాలి సమాజ్, పద్మశాలి సమాజ్ యువక్ మండలి వారు పట్టణ వ్యాప్తంగా వైభవంగా బతుకమ్మలను నిర్వహించిన వారికి ఆకర్షణీయమైన బహుమతులను అందజేశారు. భివండీ తెలుగు సమాజ్(బీటీఎస్)ఆధ ్వర్యం లో సుమారు 10 వేల మంచి నీళ్ల సీసాలను పంపిణీ చేశారు. జై హింద్ మిత్ర మండలి ఆధ్వర్యంలో పద్మశాలి సమాజ్ మంగళ కార్యాలయంలో బంగారు బతుకమ్మ పేరుతో వేడుకలు నిర్వహించి ప్రసాదా లు పంపిణీ చేశారు. పట్టణవ్యాప్తంగా సుమారు 10 వేలకుపైగా బతుకమ్మలను వివిధ ఘాట్ల వద్ద నిమజ్జనం చేశారు.
 
 నిమజ్జన ఘాట్ల వద్ద భారీ పోలీస్ బందో బస్తు నిర్వహించారు. వరాలదేవి ఘాట్ వద్దకు కార్పొరేషన్ మేయర్ ప్రతిభా విలాస్ పాటి ల్, కమిషనర్ జీవన్ సొనావునే, డిప్యూ టీ మేయరు మనోజ్ కాటేకర్, వివిధ పార్టీల కార్పొరేటర్లు, పార్టీ ల నాయకులు, అఖిల పద్మశాలి సమా జ్ కార్యాదర్శి దాసి అంబాదాస్, కార్యాధ్యక్షులు వేముల నర్సయ్య, పాశికంటి లచ్చయ్య, వంగ పురుషోత్తం, పద్మశాలి సమాజ్ యువక్ మండలి అధ్యక్షులు వడ్లకొండ రాము,  బీటీఎస్ సంస్థాపకులు నోముల శేఖర్, అధ్యక్షులు తుమ్మ రమేశ్, వివిధ సేవా సంస్థ ల అధ్యక్షులు  స్వాగతం పలికారు.
 
 ఎల్ఫిన్‌స్టన్ రోడ్డులో...
 స్థానిక ఎల్ఫిన్‌స్టన్ రోడ్‌లోని డాక్టర్ అంబేడ్కర్‌నగర్‌లోగల శ్రీ మార్కండేయ పద్మశాలి యువక సంఘం ఆధ్వర్యంలో  శనివారం సాయంత్రం సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. యేటా నిర్వహించినట్లుగానే ఈ సంవత్సరం కూడా సంఘం ఆధ్వర్యంలో పండుగను వైభవంగా జరుపుకున్నామని నిర్వాహకులు తెలిపారు. బతుకమ్మలను పేర్చేందుకు అవసరమైన పూలను రెండుమూ డు రోజుల ముందునుంచే సేకరించామని, నెల రోజులుగా బతుకమ్మ పాటలను నేర్చుకున్నామని స్థానిక మహిళలు తెలిపారు. సంప్రదాయంగా పట్టుచీరలు కట్టుకొని పెద్ద సంఖ్యలో మహిళలు ఈ వేడుకలో పాల్గొన్నారు. అనంతరం బ్యాండు మేళాలతో బతుకమ్మను డాక్టర్ అంబేడ్కర్‌నగర్ నుంచి శివాజీ పార్కు వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ‘పోయిరావమ్మ బతుకమ్మ అంటూ’ అక్కడ నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి అన్నదా న కార్యక్రమాన్ని కూడా నిర్వహించినట్లు సంఘం అధ్యక్షుడు పిట్ల నారాయణ, కార్యదర్శి పూల రామలింగం, ముఖ్య సలహాదారులు ద్యావరశెట్టి విలాస్‌లు తెలిపారు.
 
 కామ్‌రాజ్ నగర్‌లో...
 ఘాట్కోపర్‌లోని కామ్‌రాజ్‌నగర్‌లో తెలుగువారి సంప్రదాయానికి అద్దంపట్టేలా బతుకమ్మ ఉత్సవాలను జరుపుకున్నారు. తెలుగు రహివాసి సేవా సంఘం, శ్రీ చైతన్య మహిళ మండలి సంయుక్తంగా ఈ ఉత్సవాలను నిర్వహించాయి. అనంతరం స్థాని క పొచమ్మ గుడి నుంచి సమీపంలోగల చెరువు వరకు ఊరేగింపుగా వెళ్లారు. ఈ వేడుకలో సుమారు 250 మంది మహిళలు, పిల్లలు పాల్గొన్నారు.  కార్యక్రమం లో సేవా సంఘం సభ్యులు గుల్లె గంగాధర్, తిరుపతి, రవిపూజారి, శ్రీ చైతన్య మహిళా మండలి సభ్యులు గుల్లె గాయత్రి, కంటం చంద్రమ్మ, ఎం.లలిత, కె.కృష్ణవేణ క్క తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు