ఎంత కష్టమైనా ఇచ్చిన హామీలు నెరవేర్చుతాం

30 Sep, 2014 03:02 IST|Sakshi
  • సీఎం సిద్దరామయ్య
  • బళ్లారి టౌన్ : ఎంత కష్టమనిపించినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. సోమవారం మున్సిపల్ గ్రౌండ్‌లో కార్మిక శాఖ ఏర్పాటు చేసిన జాతీయ స్వాస్థ బీమా పథకం, వివిధ శాఖల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇచ్చిన 95 హామీలలో 65 హామీలను నెరవేర్చామన్నారు. అన్నభాగ్య, క్షీరభా గ్య, రుణాల మాఫీ, మైత్రి, విద్యాశ్రీ, తక్కువ వడ్డీతో రైతులకు రుణాలు వంటి పథకాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశామన్నారు.

    కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం కల్పించేందుకు ఎప్పుడూ కట్టుబడి ఉందన్నారు. గత ఉప ఎన్నికల్లో బళ్లారి జిల్లాలో ఇచ్చిన ఎ న్నికల హామీ ప్రకారం మూడేళ్లలో రూ.850 కోట్లతో వివిధ పథకాలకు నివేదిక తయారు చేశామన్నారు. ఇందులో పీడబ్ల్యూడీ రోడ్లు, గ్రామీణ రోడ్లు, తాగునీ రు, మరుగుదొడ్లు, విద్యుత్, డ్రెయినేజీ వంటి వివిధ పథకాలు ఉన్నట్లు చెప్పారు. ఈ ఏడాది రూ.304 కోట్లతో ఈ పనులను అభివృద్ధి చేస్తామన్నారు.

    బీజేపీ మతం పేరుతో విభజన రాజకీయాలు చేస్తోందన్నారు. 1.15 కోట్ల మంది జాతీయ స్వాస్థ బీమా పథకంలో స్మార్ట్‌కార్డులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ పథకాన్ని గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని దాన్ని రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.30 వేలు ఆస్పత్రి ఖర్చులను బీమా కంపెనీలు భరిస్తాయన్నారు. ఈ పథకానికి రూ.131 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని గుర్తు చేశారు.

    అంతకుముందు కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ నాయక్ మాట్లాడుతూ మంగళ గ్రహం అంతరిక్షంలోకి పంపాలనే పథకాన్ని ప్రారంభించింది మాజీ ప్రధాని మన్మోహన్‌సింగేనని, దాన్ని ఇప్పుడు బీజేపీ తమ ఘనతగా చెప్పుకుంటోందన్నారు. ఇంధన శాఖ మంత్రి డీకే.శివకుమార్ మాట్లాడుతూ చరిత్రలోనే పవిత్రమైన రోజు ఈ రోజని, ఇంతపెద్ద స్థాయిలో మంత్రులు వచ్చి వరాలు గుప్పించడం శ్లాఘనీయమని కొనియాడారు.

    కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి పీటీ పరమేశ్వరనాయక్, వివిధ శాఖల మంత్రులు హెచ్‌కే.పాటిల్,  కమరుల్ ఇస్లాం, శివరాజ్ తంగడగి, రోషన్‌బేగ్, ఉమాశ్రీ, అంబరేష్, ఎమ్మెల్యేలు చంద్రణ్ణ, అనిల్‌లాడ్, ఎంపీ రవీంద్ర, ఎన్‌వై గోపాలకృష్ణ, నాడగౌడ అప్పాజీ, తుకారాం, వీరణ్ణ మత్తికట్టి, వెంకటేశ్, బోసురాజ్, స్థానిక నేతలు కేసీ కొండయ్య, అల్లం వీరభద్రప్ప, సూర్యనారాయణరెడ్డి, మేయర్ రమేష్ పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు