జుట్టుతో.. రెండు నెలల్లో రూ. 17.8 కోట్లు!

21 Sep, 2016 09:26 IST|Sakshi
జుట్టుతో.. రెండు నెలల్లో రూ. 17.8 కోట్లు!

భక్తులు చెల్లించే చిరు మొక్కులు కూడా తిరుమల వేంకటేశ్వరునికి కాసులు కురిపిస్తున్నాయి. ఈ సంవత్సరం జూలై, ఆగస్టు రెండు నెలల్లో భక్తులు మొక్కుగా ఇచ్చిన జుట్టును వేలం వేస్తే.. ఏకంగారూ. 17.8 కోట్లు వచ్చింది. జూలై నెలలో రూ. 11.88 కోట్లు, ఆగస్టులో రూ. 5.94 కోట్ల చొప్పున జుట్టు వేలంలో వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. క్యూ కాంప్లెక్సులలో వేచి ఉండే భక్తులలో చిన్న పిల్లలకు ఉచితంగా పంపిణీ చేసేందుకు రూ. 11.28 కోట్లతో 39.32 లక్షల లీటర్ల టోన్డ్ పాలు కొనుగోలు చేస్తామని టీటీడీ బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈఓ సాంబశివరావు తెలిపారు. అలాగే, హరియాణాలోని కర్నల్ మిల్క్ ఫుడ్స్ లిమిటెడ్ నుంచి కిలో రూ. 376 చొప్పున 2.25 లక్షల కిలోల ఆవునెయ్యి కొనాలని నిర్ణయించామని, దీని మొత్తం విలువ రూ. 8.46 కోట్లు అవుతుందని, ఈ ఆవునెయ్యిని రాబోయే ఆరు నెలల పాటు తిరుపతి లడ్డూ, ఇతర ప్రసాదాల తయారీలో వినియోగిస్తామని చెప్పారు.

2016-17 సంవత్సరం మొత్తమ్మీద భక్తులు సమర్పించిన జుట్టు వేలంతో దాదాపు రూ. 150 కోట్లు వస్తుందని టీటీడీ అంచనా వేస్తోంది. తిరుమలకు ఏడాదికి దాదాపు కోటి మందికి పైగా భక్తులు తమ జుట్టును మొక్కుగా సమర్పించుకుంటారు. వారిలో పిల్లలు, మహిళలు కూడా ఉంటారు.

మరిన్ని వార్తలు