దటీజ్ హన్సిక

5 Nov, 2014 03:13 IST|Sakshi
దటీజ్ హన్సిక

 సామాజిక స్పృహ ఉన్న తారామణుల సంఖ్య చాలా తక్కువే. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని చూసే వారే ఇక్కడ అధికం. అయితే హన్సిక ఇందుకు పూర్తిగా భిన్నం. సంపాదిస్తున్న మొత్తంలో కొంతభాగం నిరుపేదలకు సాయం చేయాలనే మానవతావాది హన్సిక. ఇంత చిన్న వయసులోనే ఈమె చాలామందికి ఆదర్శంగా మారారు. తన ప్రతి పుట్టినరోజుకు ఒకరి చొప్పున ఇప్పటికి 23 మంది పేద బాలలను దత్తత తీసుకుని వారిసంరక్షణ బాధ్యతలను నిర్వహిస్తున్న ఉన్నత వ్యక్తిత్వం గల నటి హన్సిక. ఈ ముద్దుగుమ్మ ఉన్నత భావాలేపాటివన్న దానికి మరో నిదర్శనం ఏంటంటే, ఆమె ఇటీవల ప్రజలకు ఒక విజ్ఞప్తి చేశారు.

మీ పుట్టిన రోజునే, పెళ్లి రోజును లేదా ఏదైనా విశేష సందర్భల్లోనూ నిరుపేదలకు, వికలాంగులకు అన్నదానం చేయండి. మీ స్థాయిని బట్టి కొంత మొత్తాన్ని అలాంటి అభాగ్యుల కోసం ఖర్చు చేయండి. అలాంటి వారి కోసం మీ జీవితంలో ఏదో ఒక రోజున సాయం చేయండి. నేను నా పుట్టిన రోజున, ఇతర విశేష రోజుల్లో పేదలకు చేతనైన సాయం చేస్తున్నారూ.రూ. అన్నారు. సామాజిక దృక్పథంతో హన్సిక చేసిన ఈ విజ్ఞప్తికి మనసున్న ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఉంది.  ఇతర తారలు ఇలాంటి సేవలకు పిలుపునిస్తే ఇంకా బాగుంటుంది.  
 

మరిన్ని వార్తలు