-

ఎందుకలా గందరగోళం సృష్టించారు?

2 Nov, 2014 00:23 IST|Sakshi

 న్యూఢిల్లీ: తొలుత నాలుగేళ్ల అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్‌వైయూపీ)ని ఎందుకు ప్రవేశపెట్టారని ఆ తర్వాత దానిని ఎందుకు రద్దు చే సి, ఆ స్థానంలో మూడు సంవత్సరాల అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సు (టీవైయూపీ)ని ఎందుకు ప్రవేశపెట్టారంటూ ఢిల్లీ విశ్వవిద్యాలయాన్ని (డీయూ)ని హైకోర్టు శనివారం నిలదీసింది. దీనివల్ల విద్యార్థులు బాగా గందరగోళానికి గురయ్యారని పేర్కొంది.  ఇందువల్ల సదరు విద్యార్థులు అర్హత సాధించినప్పటికీ వారికి ఏయే కళాశాలల్లోనూ డిగ్రీ కోర్సులో ప్రవేశం లభించని దుస్థితి నెలకొందని ప్రధాన న్యాయమూర్తి జి.రోహిణి నేతృత్వంలోని ధర్మాసనం మండిపడింది. ఈ కోర్సులకు సంబంధించి కోర్టులు గతంలో ఇచ్చిన తీర్పులను పక్కనబెట్టి హయ్యర్ సెకండరీలో గణితం సబ్జెక్టులేని విద్యార్థికి ప్రవేశం కల్పించాలంటూ డీయూ పరిధిలోని మహరాజా అగ్రసేన్ కళాశాల యాజమాన్యాన్ని ఆదేశించింది. ఎఫ్‌వైయూపీ స్థానంలో టీవైయూపీ రావడంతోపాటు హయ్యర్ సెకండరీలో మ్యాథ్స్ సబ్జెక్టు లేదనే సాకుతో తనకు మహరాజా అగ్రసేన్ కళాశాల యాజమాన్యం ప్రవేశం కల్పించకపోవడాన్ని సవాలుచేస్తూ బాధిత విద్యార్థి దాఖలుచేసిన పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు పైవిధంగా స్పందించింది.
 

మరిన్ని వార్తలు