చిరునవ్వుతో గుండె పదిలం

30 Sep, 2016 01:40 IST|Sakshi

 సాక్షిప్రతినిధి,చెన్నై: మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి మానసిక ఒత్తిడులు తప్పవని అయితే నిత్యం చిరునవ్వుతో మెలగడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవచ్చునని డాక్టర్ జి.సెం గోట్టువేల్ అన్నారు. రోటరీ ఇంటర్‌నేషనల్ డిస్ట్రిక్ట్ 3230 వారి ఆధ్వర్యంలో ఆంధ్రా క్లబ్‌లో గురువారం వరల్డ్ హార్ట్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. డాక్టర్ మాట్లాడుతూ 2000 సంవత్సరం నుంచి వరల్డ్ హార్ట్ డే కార్యక్రమాలు సాగుతున్నాయని, అంటు వ్యాధులు కాని ఇతర వ్యాధులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టి పెట్టిందని చెప్పారు.
 
  ప్రతి ఏడాది 17.5 మిలియన్ల యువత గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తుందని, మరో పదేళ్లలో ఇది 23 మిలియన్లకు పెరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చిన్ననాటి గుండె వ్యాధులు ప్రారంభమవుతున్నా ఆలస్యంగా బయటపడుతుందని చెప్పారు. చాలా చిన్న చిన్న జాగ్రత్తలను పాటించడం ద్వారా 80 శాతం మరణాలను నివారించవచ్చునని తెలిపారు. ప్రధానంగా ప్రతి ఒక్కరూ తమ జీవన శైలిని మార్చుకోవాలని సూచించారు.
 
  పొగ తాగకపోవడం, బలవర్థకమైన ఆహారం తీసుకోవడం, అధిక బరువును రాకుండా చూసుకోవడం, షుగర్, కొలెస్ట్రాల్ పట్ల అప్రమత్తంగా ఉండడం, నిరంతర వ్యాయామం అవసరమని చెప్పారు. చిరునవ్వుతో జీవించడం ద్వారా గుండె వ్యాధులు ఉన్న వారు కూడా పదేళ్ల పాటు తమ వ్యాధిని దూరం చేసుకోవచ్చని తెలిపారు. ప్రసంగం చివరలో రొటేరియన్లందరి చేత ఆహారపు అలవాట్లపై ప్రతిజ్ఞ చేయించారు. డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ ప్రతి వారు  శారీరక శ్రమతో కూడిన ఇంటి పనులకు అలవాటు పడాలని, పౌష్టికాహారం స్వీకరించడం ద్వారా వ్యాధికి దూరంగా ఉండవచ్చునని చెప్పారు.
 
 రొటేరియన్ నాగోజి మాట్లాడుతూ ప్రతి రోజు మనం అనేక డేలను జరుపుకుంటున్నామని, అన్నింటికంటే హార్ట్ డే ఎంతో ముఖ్యమన్నారు. హీరో జీవీ ప్రకాష్ మాట్లాడుతూ ఎంతో ప్రయోజనకరమైన కార్యక్రమంలో తాను పాల్గొనడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా మై కార్డియో అనే యాప్‌ను ప్రారంభించారు. ఈ యాప్‌కు ప్రతి ఒక్కరి ఎంతో ఉపయోగపడుతుందని ఒక రోజులో ఎన్ని క్యాలరీలు స్వీకరించారు, ఎన్నిక్యాలరీలు బర్న్ చేశారు అనే వివరాలను ఎప్పటికప్పుడు తెలుపుతూ ఆరోగ్య సంరక్షణ హెచ్చరికలను చేస్తుందని తెలిపారు. మంజులా కృష్ణన్ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా సీనియర్ సినీ నటుడు శివకుమార్ పాల్గొన్నారు. సాగుతున్నాయని, అంటు వ్యాధులు కాని ఇతర వ్యాధులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టి పెట్టిందని చెప్పారు.
 
 చిన్ననాటి గుండె వ్యాధులు ప్రారంభమవుతున్నా ఆలస్యంగా బయటపడుతుందని చెప్పారు. చాలా చిన్న చిన్న జాగ్రత్తలను పాటించడం ద్వారా 80 శాతం మరణాలను నివారించవచ్చునని తెలిపారు. ప్రధానంగా ప్రతి ఒక్కరూ తమ జీవన శైలిని మార్చుకోవాలని సూచించారు. పొగ తాగకపోవడం, బలవర్థకమైన ఆహారం తీసుకోవడం, అధిక బరువును రాకుండా చూసుకోవడం, షుగర్, కొలెస్ట్రాల్ పట్ల అప్రమత్తంగా ఉండడం, నిరంతర వ్యాయామం అవసరమని చెప్పారు. మీ గుండెను మీరు ప్రేమించాలని, చిరునవ్వుతో జీవించడం ద్వారా గుండె వ్యాధులు ఉన్న వారు కూడా పదేళ్ల పాటు తమ వ్యాధిని దూరం చేసుకోవచ్చని తెలిపారు.
 
  ప్రసంగం చివరలో రొటేరియన్లందరి చేత ఆహారపు అలవాట్లపై ప్రతిజ్ఞ చేయించారు. డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ ప్రతి వారు  శారీరక శ్రమతో కూడిన ఇంటి పనులకు అలవాటు పడాలని, పౌష్టికాహారం స్వీకరించడం ద్వారా వ్యాధికి దూరంగా ఉండవచ్చునని చెప్పారు. రొటేరియన్ నాగోజి మాట్లాడుతూ ప్రతి రోజు మనం అనేక డేలను జరుపుకుంటున్నామని, అన్నింటికంటే హార్ట్ డే ఎంతో ముఖ్యమన్నారు. హీరో జీవీ ప్రకాష్ మాట్లాడుతూ ఎంతో ప్రయోజనకరమైన కార్యక్రమంలో తాను పాల్గొనడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా మై కార్డియో అనే యాప్‌ను ప్రారంభించారు. మంజులా కృష్ణన్ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా సీనియర్ సినీ నటుడు శివకుమార్ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు