మండే ఎండలా.. మజాకా!

28 Apr, 2015 02:11 IST|Sakshi
మండే ఎండలా.. మజాకా!

మండే ఎండల్లో కొందరు చల్ల చల్లని పానీయాలు అమ్ముకుంటూ బతుకు బండిని లాగిస్తున్నారు. మరి కొందరు ఎండలే అదనుగా భావించి ధరలు పెంచి దండుకుంటున్నారు. ప్రజలేమో ఎండలకు తట్టుకోలేక గొంతు తడుపుకోవడానికి పరుగులు తీస్తున్నారు. ఇలా ఒక్కొక్కరికి ఒకో రీతిలో మండే ఎండలా.... మజాకా  అనిపిస్తున్నాయి.
 - రాయచూరు
 
రాయచూరు: ఉత్తర కర్ణాటకలో రెండే సీజన్లు వేసవి, అతి వేసవి అన్న సంగతి తెలియని వారెవరూ ఉండరేమో. మే రాక ముందే ఎండలు మండిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా రెండు నెలలుగా (మొన్న కురిసిన అకాల వర్షం మినహా) సగటున 39 నుంచి 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లా కేంద్రమైన రాయచూరు నగరానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి మండుటెండలు స్వాగతం ప లుకుతున్నాయి. దీంతో వారు సహజంగానే చల్లటి పానీ యాలు, చలువ చేసే పదార్థాల కోసం తపిస్తున్నారు. ఉన్నవా రు ఎలాగూ బాటిళ్ల నీళ్లను కొని దాహం తీర్చుకుంటున్నారు. పేదవారు ఆర్‌టీసీ ఏర్పాటు చేసిన తాగునీరు అలాగే అక్కడి అన్నపూర్ణ క్యాంటీన్ నీళ్లను తాగి ఉపశమనం పొందుతున్నా రు. ఇక చల్లటి పానీయాల సంగతి సరే సరి చెరుకు రసంతో పాటు రకరకాల జూస్‌లు ఇతరత్రా డ్రింక్స్ ప్యాపారాలు జో రుగా కొనసాగుతున్నాయి.

ఇక యాపలదిన్ని తదితర గ్రా మాల నుంచి తెలుగు వారైన మహిళలు బస్టాండ్ రెండు ప్ర ధాన గేట్ల బయట తాటిముంజలను రూ.10 కి 4-5 చొప్పున అమ్ముతున్నారు. రెండు నెలల నుంచి ఈ మహిళలు ప్రజలకు చలువ చేసే తాటిముంజలను విక్రయిస్తున్నారు. ఇక పుచ్చకాయ ఒక ముక్క 10 రూపాయలు కాగా అలాగే ఖర్బుజా ఇతర చలువ నిచ్చే ఆహార పదార్థాలు, కాయగూరల వైపు ప్రజలు పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా దోసకాయ, క్యారెట్, మొలకెత్తిన పెసర్లు తదితరాలకు డిమాండ్ ఎక్కువగానే ఉంది. ఇవి రోజు రోజుకూ ధరలు మారుతున్నాయి. ఈ విషయమై స్థానిక స్టేషన్ రోడ్డు వెస్ట్‌పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న కూరగాయల ప్రముఖ వ్యాపారి, మాజీ దళపతి వీరణ్ణ మాట్లాడుతూ, 100 గ్రాములు ఉన్న మొలకెత్తిన పెసర్లు రూ.12, అలాగే దోసకాయ, క్యారెట్, నిమ్మకాయ, ముల్లంగి, బీరకాయ తదితరాలన్ని కేజీ రూ.40-50 పైమాటే. ఇక నిమ్మకాయల ధరను అడగాల్సిన పని లేదన్నారు. రెండు రోజుల క్రితం బసవ జయంతి, వైశాఖమాస పెళ్లిళ్ల సీజన్‌తో పలు కాయగూరల ధరలు ఒక్క సారిగా రెండింతలు మూడింతలు పెరిగాయి. ఎవర్‌గ్రీన్ ఎళెనీరు(కొబ్బరి బొండం) ధర రూ.30 దగ్గర స్థిర పడిపోయింది.

మరిన్ని వార్తలు