నోట్ల రద్దుతో స్తంభించిన ట్రాఫిక్

9 Nov, 2016 11:09 IST|Sakshi
హైదరాబాద్: పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న సంచలనాత్మన నిర్ణయంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టోల్‌ప్లాజాల వద్ద రూ. 500, రూ.1000 నోట్లు తీసుకోకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని టోల్‌గేట్‌ల వద్ద బుధవారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. టోల్‌గేట్ సిబ్బంది ‘పెద్ద’నోట్లు తీసుకోవడానికి నిరాకరించడంతో.. కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్‌ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
 
సుమారు 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నల్లగొండ జిల్లాలోని పంతంగి, మాడ్గులపల్లి, సూర్యాపేట జిల్లాలోని కేతెపల్లి టోల్‌గేట్ల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ అంశంపై టోల్ ప్లాజా అధికారులను సంప్రదించగా నోట్లు తీసుకోవడానికి నిరాకరించడం లేదని.. సరిపడ చిల్లర లేకపోవడం వల్లే ఈ ఇబ్బంది తలెత్తుతుందని అంటున్నారు. 
 
>
మరిన్ని వార్తలు