మావుళ్లమ్మను దర్శించుకున్న రాంచరణ్‌

19 Apr, 2017 17:24 IST|Sakshi
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మావుళ్లమ్మను సినీ హీరో రాంచరణ్ దంపతులు బుధవారం దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సినిమా షూటింగ్ నిమిత్తం భీమవరం వచ్చినట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల పాటు భీమవరం పరిసర ప్రాంతాలలో సినిమా షూటింగ్ జరగనుంది.
 
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పీరియాడిక్ లవ్ స్టోరీగా తెలుస్తోంది. ఇప్పటికే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తయ్యింది. రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తుండగా దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
మరిన్ని వార్తలు