అది పిరికితనం...

26 Nov, 2015 07:26 IST|Sakshi
అది పిరికితనం...

బెంగళూరు : మత అసహనం పట్ల బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ఖాన్ చేసిన వ్యాఖ్యలపై బహుభాష నటుడు ఉపేంద్ర నిరసన వ్యక్తం చేశారు. దేశంలో మత అసహనం పెరిగి పోతోందంటూ అమీర్ వ్యాఖ్యలపై ఉపేంద్ర స్పందించారు. అమీర్ వ్యాఖ్యలు పిరికితనాన్ని ప్రతిబింభించేలా ఉన్నాయన్నారు. 'మత అసహనం పెరిగి పోతుంటే దానిని అరికట్టేందుకు పోరాడాలి కాని... భయం వేస్తోంది... దేశం వదిలిపోతానని చెప్పడం సరికాదని ఉపేంద్ర బుధవారం ట్వీట్టర్లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు