హరికృష్ణ హఠాన్మరణంపై చలించిపోయిన సిమ్రాన్‌

29 Aug, 2018 19:21 IST|Sakshi

సాక్షి, చెన్నై : సినీ నటుడు, రాజ్యసభ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ మృతి వార్త వినగానే దిగ్భ్రాంతికి గురయ్యానని సీనియర్‌ నటి భానుప్రియ అన్నారు. హరికృష్ణ మృతి చెందారంటే ఇంకా నమ్మలేకున్నానని అన్నారు. ఆయన మృతిపట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారామె. ఆయనతో రెండు చిత్రాలు చేశానని, సెట్‌లో ఆయన అందరితో కలివిడిగా అభిమానంగా ఉంటారని తెలిపారు. తన కుటుంబం అంటే హరికృష్ణకు చాలా అభిమానమన్నారు. ఆయన మృతి చిత్రసీమకే కాదు ఆయనను అభిమానించే వారందరికీ తీరనిలోటేనన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భగవంతుడు ఆ కుటుంబానికి బాధను తట్టుకునే ధైర్యాన్ని ఇవ్వాలని వేడుకున్నారు.

షాక్‌ గురయ్యా : రాధికా శరత్‌ కుమార్‌
నందమూరి హరికృష్ణ మృతి వార్త వినగానే షాక్‌కు గురయ్యానని సీనియర్‌ నటి రాధికా శరత్‌కుమార్‌ అన్నారు. ఆయన మృతిపట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారామె. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

చాలా బాధ కలిగింది : సిమ్రాన్‌
కారు ప్రమాదంలో మరణించిన నందమూరి హరికృష్ణకు నటి సిమ్రాన్‌ సంతాపం తెలిపారు. ఆయన హఠాన్మరణం చాలా బాధకలిగించిందని ఆమె అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. హరికృష్ణకు మంచిపేరు తెచ్చిపెట్టిన సీతయ్య సినిమాలో ఆయనకు జోడిగా సిమ్రాన్‌ నటించిన సంగతి తెలిసిందే.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు