కాంగ్రెస్‌పై మోడీ నిప్పులు

1 Mar, 2014 01:44 IST|Sakshi
కాంగ్రెస్‌పై మోడీ నిప్పులు
  • కాంగ్రెస్‌పై మోడీ నిప్పులు
  •  అవినీతికి ఆ పార్టీ మారుపేరు
  •  ప్రజల విశ్వసనీయత కోల్పోయింది
  •  ఓటు బ్యాంక్ రాజకీయాలు నమ్మొద్దు
  •  దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌కు వ్యతిరేక తుపాను
  •  త్వరలో అది సునామీగా మారనుంది
  •  ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళనలు.. ఢిల్లీలో కాంగ్రెస్ నేతల జల్సాలు
  •  సాక్షి ప్రతినిధి, బెంగళూరు : దురహంకారానికి పర్యాయ పదంగా మారిన కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయత కోల్పోయిందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ విమర్శించారు. గుల్బర్గ, హుబ్లీలలో శుక్రవారం జరిగిన పార్టీ బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడే కాంగ్రెస్‌ను ఎప్పుడూ నమ్మవద్దని కోరారు. అవినీతి, కుటుంబ రాజకీయాలకు ఆ పార్టీ చిరునామాగా మారిందని దుయ్యబట్టారు. అలాంటి పార్టీని వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మట్టి కరిపించాలని ప్రజలను కోరారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేక తుపాను బలపడుతోందని, క్రమంగా ఇది ఎన్నికల నాటికి సునామీ రూపం దాల్చుతుందని అన్నారు.

    ఎన్నికల తేదీలు ప్రకటిస్తే కాంగ్రెస్‌పై ఉన్న ప్రజా వ్యతిరేకత ప్రభంజనంలా మారడం ఖాయమని, ఆ ప్రభంజనంలో కాంగ్రెస్ చిరునామా లేకుండా కొట్టుకు పోతుందని జోస్యం చెప్పారు. స్వయృంకతాపరాధం వల్లే ఆ పార్టీ అంతర్థానమవుతుందన్నారు. తమ ఈతి బాధలన్నిటికీ కాంగ్రెస్ కారణమని దేశ ప్రజలు ఎప్పుడో గుర్తించారని తెలిపా రు. పేద, యువత, రైతుల ప్రధాన ధ్యేయం కూడా కాంగ్రెస్ పతనమేనని పేర్కొన్నారు. న్యాయ కోవిదుడు ఫాలి నారిమన్ లోక్‌పాల్ అన్వేషణ కమిటీలో చేరడానికి విముఖత వ్యక్తం చేయడాన్ని ప్రస్తావిస్తూ, ఆ పార్టీ అవినీతి రాజకీయాలకు ఇది తాజా తార్కాణమని అన్నారు.

    తెలంగాణ విభజనను ప్రస్తావిస్తూ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఆందోళనలు చేస్తుంటే, ఢిల్లీలో ఆ పార్టీ వారంతా జల్సాల్లో మునిగి తేలారని విమర్శించారు. సీమాంధ్రలో నూకలు చెల్లాయని గ్రహించే ఆ ప్రాంతానికి కాంగ్రెస్ తీరని ద్రోహం చేసిందని దుయ్యబట్టారు. దేశాన్ని, రాష్ట్రాలను, ఆఖరుకు ప్రజృ హదయాలను కూడా కాంగ్రెస్ ముక్కలు చేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హామీలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని ప్రజలను కోరారు. అధికారంలోకి వచ్చే ముందు ద్రవ్యోల్బణాన్ని వంద రోజుల్లో అదుపు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ హామీని నిలబెట్టుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. సభల్లో పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు ఎం. వెంకయ్య నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి అనంత కుమార్, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు