కరుణాస్‌కు హైకోర్టులో ఊరట

13 May, 2016 02:50 IST|Sakshi
కరుణాస్‌కు హైకోర్టులో ఊరట

తమిళసినిమా: నటుడు కరుణాస్‌కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. హాస్యనటుడిగా, కథానాయకుడిగా ప్రాచుర్యం పొందిన కరుణాస్ రాజకీయ రంగప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఆయన తిరువానటనై నియోజక వర్గం అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఈయన అభ్యర్థిత్వం చెల్లదంటూ రామనాథపురం జిల్లాకు చెందిన రాజీవ్‌గాంధీ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో తాను రామనాథపురం జిల్లా తిరువా
 టనై నియోజక వర్గం నుంచి నామ్ తమిళర్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశానన్నారు.
 
  తనతో పాటు ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేశారని పేర్కొన్నారు. కరుణాస్ ఇదే నియోజక వర్గం నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని తెలిపారు. అయితే ఆయన అన్నాడీఎంకే సభ్యుడు కాదని, ముక్కులత్తూర్ పడై సంఘానికి నిర్వాహకుడుగా పేర్కొన్నారు. నామినేషన్ దరఖాస్తులో నిబంధనలకు విరుద్ధంగాఅన్నాడీఎంకే అభ్యర్థిగా పేర్కొన్నారని ఆరోపించారు. అన్నాడీఎంకేను గుర్తింపు పొందిన పార్టీ అని దాని గుర్తును అందులోని సభ్యులే ఉపయోగించుకోవాలన్నారు.
 
  ఎన్నికల అధికారుల అనుమతి లేకుండా ఇతరులు వాడుకోరాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కరుణాస్ వేసిన నామినేషన్ చెల్లదని, దానిని నిరాకరించాలని కోరారు. ఈ పిటిషన్ న్యాయమూర్తులు ఎన్.కృపాకరన్, మురళీధర న్ సమక్షంలో గురువారం విచారణకు వచ్చింది. వారి వాదనలు విన్న న్యాయమూర్తులు ఎన్నికల అధికారులు వెల్లడించిన అభ్యర్థుల పట్టికలో ఉన్న పేరును తొలగించాలని కోరే హక్కు ఎవరికీ ఉండదని, ప్రతి వాదికి ఏమైనా అభ్యంతరం ఉంటే ఎన్నికల అనంతరం కోర్టులో పిటిషన్ దాఖలు చేయవచ్చని కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
 

>
మరిన్ని వార్తలు