ఆ రెండు సంస్థల ఆఫీసులను తిరిగి అప్పగించండి

18 May, 2014 23:07 IST|Sakshi

ముంబై: దక్షిణ ముంబై ఓడరేవు ప్రాంతంలోని వేల్హారి ట్రేడింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, ఎంఎస్ ఆటో ఇన్వెస్ట్‌మెంట్‌లపై జప్తును ఎత్తివేసి, భవనాలు తిరిగి అప్పగించాలని బాంబే హైకోర్టు పోలీసులను ఆదేశించింది. సాంగ్లీ బ్యాంక్ (ప్రస్తుతం ఇది ఐసీఐసీఐ బ్యాంకులో విలీనమైంది) ఆవరణలోని ఆఫీసులను ఈ రెండు సంస్థలు అద్దెకు తీసుకున్నాయి. ముంబై పోలీసు శాఖ అనుబంధ ఆర్థిక నేరాల విభాగం జరిపిన విచారణలో ఆ రెండు సంస్థలు ఏ నేరంలోనూ భాగస్వాములైనట్లు తేల లేదని జస్టిస్ పి.వి.హర్దాస్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

ఎంఎస్ రూఫిట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థతోపాటు దాని డెరైక్టర్లు, అదే ప్రాంగణంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న రాకేష్ అగర్వాల్ అనే వ్యక్తి 2003లో ఆర్థిక నేరాల విభాగంలో కేసు నమోదు చేశాడు. అయితే విచారణ సమయంలో  వెల్హారి ట్రేడింగ్, ఆటో ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలను సీల్ చేశారు. ఆ రెండు సంస్థలు మహారాష్ట్ర ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ డిపాజిటర్స్(ఎంపీఐడి) కోర్టును ఆశ్రయించాయి. అయితే విచారణ కొనసాగుతున్నందున ఆయా ఆస్తుల విడుదల కోర్టు నిరాకరిం చింది.

దీంతో రెండు సంస్థలకు హైకోర్టుకు వెళ్లా యి. నవంబర్ 2004లోనే విచారణ పూర్తయిందని, చార్జిషీట్ కూడా దాఖలు చేశారని హైకోర్టు తెలి పింది. అయితే ఆ భవనంలో అద్దెకు ఉంటున్న రెండు సంస్థలు ఏ నేరానికీ పాల్పడలేదని ఈ ఏడా ది ఫిబ్రవరిలో ఆర్థిక నేరాల విభాగం సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. నిందితులకు కేవలం మంచి చేయాలనే ఉద్దేశంతోనే రెండు సంస్థలు ఆవరణను ఇచ్చాయని కోర్టు తెలిపింది. అయితే రెండు ఆఫీసు ఆవరణలను తమకు ఇచ్చేయాలని  ఐసీఐసీఐ బ్యాంక్ విచారణ సమయంలో కోరింది. సాంగ్లీ బ్యాంకుకు న్యాయబద్ధమైన కిరాయిదారులైనందున బ్యాంక్ వాదనను పక్కకు పెట్టిన హైకోర్టు... పై విధంగా తీర్పు నిచ్చింది. 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు