కేజ్రీవాల్‌ నివాసం వద్ద హైడ్రామా

9 Jun, 2017 15:21 IST|Sakshi
కేజ్రీవాల్‌ నివాసం వద్ద హైడ్రామా

న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నుంచి సస్పెన్షన్‌కు గురైన మాజీ మంత్రి కపిల్‌ మిశ్రా, ఆయన అనుచరులను అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసం వద్ద అడ్డగించడంతో శుక్రవారం హైడ్రామా నెలకొంది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ నిర్వహిస్తున్న ‘జనతా దర్బార్‌’లో పాల్గొనేందుకు తన 25 మంది మద్దతుదారులతో కలిసి కేజ్రీవాల్‌ నివాసానికి వచ్చారు. అనుమతి లేదన్న కారణంతో వీరిని అడ్డుకున్నారు. దీంతో మిశ్రా, ఆయన అనుచరులు కేజ్రీవాల్‌ నివాసం వెలుపల ధర్నాకు దిగారు.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యశాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ను ఎందుకు పదవి నుంచి తొలగించలేదని కేజ్రీవాల్‌ అడగానికి వస్తే తనను అనుమతించలేదని మిశ్రా తెలిపారు. ‘జనతా దర్బార్‌లో తనను కలిసేందుకు కేజ్రీవాల్‌ ఎందుకు అనుమతిచడం లేదు? ఆయన ఎటువంటి తప్పు చేయకపోతే నన్ను ఎందుకు కలవడం లేదు?’ అని ప్రశ్నించారు. 2013, ఆగస్టులో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆప్‌ కార్యకర్త సంతోష్ కోలి తల్లిని మిశ్రా తన వెంట తీసుకొచ్చారు. సంతోష్‌ మృతిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు