ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై హిజ్రా దాడి

5 Jul, 2016 01:39 IST|Sakshi

వేలూరు: వేలూరు కొత్త బస్టాండ్‌లో ప్రభుత్వ బస్సు డ్రైవర్‌పై హిజ్రా దాడి చేయడంతో సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే కొత్త బస్టాండ్‌కు చెన్నై నుంచి ప్రభుత్వ బస్సును డ్రైవర్ రమేష్ మధ్యాహ్నం 1.30 గంటలకు నడుపుకుంటూ వచ్చి నిలిపాడు. అనంతరం ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్లేందుకు బస్సు ను నిలిపాడు. ఆ సమయంలో బస్టాండ్‌లోని ఒక హిజ్రా బస్సులోనికి ఎక్కి ప్రయాణికుల వద్ద డ బ్బులు వసూలు చేస్తున్నారు. ఆ సమయంలో బస్సు డ్రై వర్ రమేష్ ప్రయాణికులను ఇబ్బంది పెట్టకుండా బస్సు నుంచి కిందకు దిగాలని తెలిపాడు.

దీంతో ఆగ్రహించిన హిజ్రా డ్రైవర్‌పై దాడికి దిగి అసభ్య పదజాలంలో దూషించింది. దీంతో హిజ్రా, డ్రైవర్ మద్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో బస్సు డ్రైవర్ రమేష్ షర్టును హిజ్రా చించివేసింది. అనంతరం కండక్టర్ అడ్డగించడంతో కండక్టర్ బ్యాగులో ఉన్న రూ.2500 నగదును దోచేసి పరారయ్యేందుకు ప్రయత్నించింది. వెంటనే ప్రయాణికులు హిజ్రాను అడ్డుకొని అక్కడే ఉన్న పోలీసులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న సహ డ్రైవర్‌లు చెన్నై బస్టాండ్ వద్దకు చేరుకున్నారు. వెంటనే హిజ్రాపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో అక్కడే ఉన్న పోలీసులు ప్రభుత్వ బస్సు డ్రైవర్‌లను అడ్డుకొని చర్చలు జరిపారు. అనంతరం ప్రయాణికుల చర్చల అనంతరం బస్సు డ్రైవర్ బస్సును నడిపాడు. దీంతో అరగంట పాటు కొత్త బస్టాండ్‌లోని ప్రభుత్వ బస్సులు నిలిచి పోయింది.

మరిన్ని వార్తలు