ఇళ్ల ధరలకు కళ్లెం

16 Dec, 2013 01:07 IST|Sakshi

సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ బిల్డర్ల పట్ల కఠినంగా వ్యవహరిం చడం సామాన్యుడికి కొంతమేర మేలుచేసినట్టయింది. సీఎంగా ఆయన పగ్గాలు చేపట్టిన తర్వాత నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో ఇళ్ల ధరలు కొంతమేర తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. 2012తో పోలిస్తే 2013లో ఇళ్ల ధరలు మూడు శాతం మేర పెరిగాయి.

అయితే చవాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి పరిశీలిస్తే ప్రస్తుతం ఐదు నుంచి తొమ్మిది శాతం ఇళ్ల ధరలు తగ్గినట్లు తేలింది. ఇందుకు కారణం బిల్డర్లు ఎట్టిపరిస్థితుల్లోనూ నియమనిబంధనల ప్రకా రం నడుచుకోవాలంటూ సీఎం ఆదేశించడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. నగరంలోని వర్లి, పశ్చిమ, తూర్పు శివారు ప్రాంతాలు, ఠాణే, పన్వేల్ పరిసరాల్లో ఇళ్ల ధరలకు కళ్లెం పడింది. ‘నైంటినైన్ ఏకర్స్ డాట్ కామ్’ అనే సంస్థ రియల్ ఎస్టేట్ రంగంపై ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. చవాన్ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తర్వాత నిర్మాణరంగానికి సంబంధించి పలు ఆంక్ష లు విధించారు. నియమనిబంధనల్లో పలు మార్పులు కూడా చేశారు. అయితే దీనిని అడ్డుకునేందుకు బిల్డర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
 

మరిన్ని వార్తలు