తెల్ల చీరలో తడవడమా?

18 Mar, 2015 01:48 IST|Sakshi
తెల్ల చీరలో తడవడమా?

 సాధారణంగా వానపాటల్లో నాయికలు తెల్లచీర ధరించి అందాలారబోయడం పరిపాటి. సీనియర్ నటీమణుల నుంచి ఈ తరం నాయికల వరకు చాలామంది అలా తడి తడి అందాలు ఆరబోసినవారే. ఆ మధ్య తమన్న తెలుగు చిత్రం రచ్చలోను, తమిళ చిత్రం పైయ్యాలోను ఈ తరహా అందాలారబోశారు. అలాంటిది పెద్దగా అవకాశాలు లేకపోయినా తాప్సీ బికినీ లాంటివి ధరించేది లేదని ఖరాఖండిగా చెప్పేస్తుందట. అంతేకాదు తెల్లచీర ధరించి వాన పాటల్లో నటించడానికి ససేమిరా అంటోందట. దీని గురించి ఈ అమ్మడు తెలుపుతూ కొన్ని చిత్రాల్లో తనను ఈత దుస్తుల్లో ధరించి నటించమన్నారని అందుకు సరిపడే శరీరాకారం తనకు లేదని అనుకుంటున్నానన్నారు.  ఏదేమైనా తాను నటించే చిత్రాల్లో దుస్తులు విషయంలో చాలా శ్రద్ధ చూపుతానని చెప్పింది.  సమీపకాలంలో ఒక హిందీ చిత్రం కోసం తెల్లచీర ధరించి వానపాటలో నటించమని అన్నారని అందుకు తాను అంగీకరించలేదని అన్నారు. చివరికి వేరే కలర్ చీరతో వర్షంలేకుండా ఆ చిత్రంలో నటించానని తాప్సీ తెలిపింది.
 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు