సారీ కెప్టెన్..

9 Nov, 2016 04:17 IST|Sakshi
సారీ కెప్టెన్..

    ఉపఎన్నికల్లో ఎవరికీ
     మద్దతుఇచ్చేది లేదన్న
     మక్కల్ ఇయక్కం నేతలు
     డీఎండీకేకు మద్దతుపై తిరుమా మరో కొత్త పలుకు
 

 సాక్షి, చెన్నై: మక్కల్ ఇయక్కం వర్గాల మాటల గారడీ రాజకీయ విశ్లేషకులనే విస్మయంలో పడేస్తోంది. రోజుకో మా ట, పూటకో అభిప్రాయం వ్యక్తం చేయడమే కాకుండా, మరో మారు డీఎండీకే అధినేత విజయకాంత్‌కు ఝలక్ ఇచ్చారు. నిన్నటి వరకు మద్దతు కోరితే, పరిశీలన అని పలికిన ఆ నాయకులు మంగళవారం ఉప ఎన్నికల్లో డీఎండీకేకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చారు. ఇక, వీసీకే నేత తిరుమావళవన్ కొత్త పలుకుగా, యూసీసీకి వ్యతిరేకంగా రా జకీయ పక్షాలు ఏకం కావాలంటూ అఖి ల పక్షానికి పిలుపునిచ్చే పనిలో పడ్డారు.
 
 మక్కల్ ఇయక్కంలోని ఎండీఎంకే నేత వైగో, సీపీఎం నేత రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్, వీసీకే నేత తిరుమావళవన్‌ల తీరు విమర్శలకు దారి తీస్తున్నారుు. రోజుకో మాట, పూటకో అభిప్రాయం అన్నట్టుగా ఎవరికి వారు మీడియా ముందుకు వచ్చి చర్చల్లోకి ఎక్కడమే కాకుండా, విమర్శలను, వ్యంగ్యాస్త్రాలను ముట్టగట్టుకునే పనిలో పడ్డారు. నిన్నటి వరకు ఉప ఎన్నికల్లో  డీఎండీకే మద్దతు కోరితే పరిశీలిస్తామన్న సీపీఎం, సీపీఐ, వీసీకే నేతలు , తాజాగా మద్దతు ఇచ్చే ప్రసక్తేలేదని తేల్చేశారు. వీరి పరిశీలన మేరకు డీఎండీకే అధినేత విజయకాంత్ సతీమని ప్రేమలత మీడియాతో మాట్లాడుతూ, పరిస్థితులకు అనుగుణంగా తమకు మద్దతును ప్రకటించాలని విన్నవించారు. దీంతో మక్కల్ ఇయక్కం మద్దతు ఉప రేసులో ఉన్న డీఎండీకే అభ్యర్థులకు దొరికినట్టేనా..? అన్న ఎదురు చూపులు పెరిగా రుు.
 
 అయితే, మీడియా సందించిన ప్రశ్నలకు సమాధానంగానే పరిశీలన అన్న నినాదాన్ని తాము తెర మీదకు తెచ్చామేగానీ, ఉప ఎన్నికల్లో ఎవ్వరికీ మద్దతు లేదంటూ ఆ ఇయక్కం తేల్చడం డీఎండీకేకు మరో షాక్కే. గత వారం విజయకాంత్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించి తప్పు చేశామని ఆ ఇయక్కంలోని వైగో స్పందిస్తే, తాజాగా మిగిలిన ముగ్గురు విజయకాంత్‌కు పరిశీలన అంటూ ఝలక్ ఇవ్వడం గమనార్హం. వీసీకే నేత తిరుమావళవన్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ,  ఉప ఎన్నికల్ని బహిష్కరిస్తూ ఇయక్కం వర్గాలు నిర్ణయం తీసుకున్నాయని,
 
  విజయకాంత్ తమ వద్దకు వచ్చి ఎలాంటి మద్దతు కోరలేదని, ఏ పనిచేసినా సక్రమంగా చేయాలన్నదే తన అభిమతం అని, అందుకే ఉప ఎన్నికల్లో ఎవ్వరికీ మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. సీపీఎం నేత రామకృష్ణన్ అదేపల్లవి అందుకున్నారు. తామందరం కల సి కట్టుగా ఎన్నికల బహిష్కరణ నిర్ణ యం తీసుకున్నామని, అలాంటప్పుడు ఎలా మద్దతు ఇస్తామని మీడియాకు ఎదురు ప్రశ్న వేశారు. ఇక, పరిశీలన అన్న విషయం, కేవలం డీఎండీకేకు మద్దతు ఇస్తారా..? అని  మీడియా  సంధించిన ప్రశ్నకు , అటు వైపు నుంచి వచ్చే విజ్ఞప్తి మేరకు పరిశీలన అని సమాధానం ఇచ్చామేగానీ, మద్దతు ఇచ్చేస్తామని చెప్పలేదుగా అంటూ స్పందించారు.
 
 తిరుమా కొత్త పల్లవి :  యూనిఫాం ’సివిల్’ కోడ్ (యూసీసీ- ఉమ్మడి పౌర సృ్మతి)కి వ్యతిరేకంగా రాష్ట్రంలో మైనారిటీ సంఘాలు, పార్టీలు, జమాత్‌లు ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో తాము సైతం అంటూ వీసీకే నేత తిరుమావళవన్ కదిలారు. ఏకంగా సివిల్ కోడ్‌కు వ్యతిరేకంగా ఏకం అవుదామని రాజకీయ పక్షాలకు పిలుపు నిచ్చారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఈ విషయంలో తమతో చేతులు కలపాలని, ప్రతి పక్షాలన్నీ ఏకం కావాలని కోరారు.  అఖిల పక్షంగా ముందుకు సాగుదామని, యూసీసీని వ్యతిరేకిద్దామని పిలుపు నిచ్చారు.

మరిన్ని వార్తలు