పన్నీరు, స్టాలిన్‌లది ఒక్కటే డిమాండ్ కానీ..

18 Feb, 2017 14:23 IST|Sakshi
పన్నీరు, స్టాలిన్‌లది ఒక్కటే డిమాండ్ కానీ..

చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం మధ్య బలపరీక్ష జరుగుతోంది. ప్రజాభిప్రాయం విన్న తర్వాతే ఓటింగ్ నిర్వహించాలని మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్‌ స్టాలిన్ డిమాండ్ చేశారు. రహస్య పద్ధతిలో ఓటింగ్ నిర్వహించాలని ఇద్దరూ అసెంబ్లీ స్పీకర్ ధనపాల్‌ను కోరారు. స్పీకర్ వీరి డిమాండ్‌ను తిరస్కరిస్తూ డివిజన్ వారీగా ఓటింగ్ నిర్వహించారు.

అసెంబ్లీలో స్టాలిన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పళనిస్వామి బలనిరూపణకు గవర్నర్ విద్యాసాగర్ రావు 15 రోజులు సమయం ఇచ్చారని, ఎందుకు హడావుడిగా ఓటింగ్ నిర్వహిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. బలపరీక్షను మరోరోజుకు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. రహస్య పద్ధతిలో ఓటింగ్ నిర్వహిస్తేనే ప్రజాస్వామ్యానికి రక్షని స్టాలిన్ చెప్పారు. సభలో పన్నీరు సెల్వం మాట్లాడుతూ.. కువతూర్‌లోని గోల్డెన్ బే రిసార్ట్‌లో ఎమ్మెల్యేలను ఉంచిన విషయం అందరికీ తెలుసునని, ప్రజాభిప్రాయం విన్న తర్వాతే ఓటింగ్ నిర్వహించాలని కోరారు. రహస్య పద్ధతిలో ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆయన సభలో నిరసనకు దిగారు. స్పీకర్ రహస్య ఓటింగ్‌ను తిరస్కరించడంపై స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటింగ్‌ ప్రక్రియను అడ్డుకునేందుకు డీఎంకే, పన్నీరు సెల్వం వర్గీయులు ప్రయత్నించారు. కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) కూడా రహస్య ఓటింగ్‌కు పట్టుపట్టాయి.
 

మరిన్ని తమిళనాడు విశేషాలు..

భారీ భద్రతతో బయల్దేరిన ఎమ్మెల్యేలు

పళని శిబిరం నుంచి మరో ఎమ్మెల్యే జంప్‌

మొన్నటివరకు గవర్నర్.. నేడు స్పీకర్!

ఎవరీ సైనైడ్ మల్లిక!

పళనిస్వామిని ఓడించండి: రాహుల్

అమ్మకు ఓటేయండి

నన్ను చూసి నవ్వొద్దు

‘మ్యాజిక్‌’ చేసేదెవరు?

 

మరిన్ని వార్తలు