అవసరమైతే శివసేనతో చర్చిస్తా..

17 Oct, 2014 22:50 IST|Sakshi

పంకజా ముండే
 
సాక్షి, ముంబై: అధికారంలోకి వచ్చేందుకు సహకారం తీసుకోవాల్సి వస్తే శివసేనతో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు దివంగత గోపీనాథ్ ముండే కుమార్తె పంకజా ముండే పేర్కొంది. ప్రస్తుత పరిస్థితిలో శివసేన, బీజేపీల మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ లభించనట్లయితే శివసేన మద్దతు అవసరం కానుంది. అలాంటి సమయంలో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేతో చర్చలు జరిపేందుకు పంకజా ముండే సరైన నాయకురాలిగా భావిస్తున్నారు.

ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవి అభ్యర్థిగా ఆమెను ప్రకటించినట్టయితే ఉద్దవ్ ఠాక్రేకూడా బీజేపీకి మద్దతు పలికేందుకు పెద్దగా అభ్యంతరం చెప్పకపోవచ్చని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  పంకజా ముండే తన సోదరిలాంటివారని పేర్కొంటూ బీడ్ జిల్లాలో ఆమెకు వ్యతిరేకంగా శివసేన ఎవరిని బరిలోకి దింపలేదు. అలాగే భావి ముఖ్యమంత్రిగా ఆమెకు మద్దతు ఇచ్చేందుకు కూడా అభ్యంతరం చెప్పకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు