ఇళయరాజాకు అవమానం

8 Jun, 2016 04:18 IST|Sakshi
ఇళయరాజాకు అవమానం

చెన్నై: ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజాకు బెంగళూర్ విమానాశ్రయంలో అవమానం జరిగింది. తనిఖీ పేరుతో అక్కడి సెక్యూరిటీ అధికారులు అత్యుత్సాహం చూపించి ఇళయరాజాను అవమాన పరిచారు.వివరాల్లోకెళ్లితే ఇళయరాజా కొన్ని రోజుల క్రితం తన కొడుకు కార్తీక్‌రాజా,కుటుంబసభ్యులతో కలిసి మంగుళూర్‌లో గల దేవాలయానికి దేవుని దర్శనార్థం వెళ్లారు. అనంతరం ఆదివారం రాత్రికి చెన్నైకి తిరుగు ప్రయాణం అయ్యారు.

బెంగళూర్ వియానాశ్రయంలో ఆయన్ని అక్కడి సెక్యూరిటీ అధికారులు తనిఖీ చేశారు. అప్పుడు ఇళయరాజా వద్ద దేవుని ప్రసాదం ఉండడంతో దాన్ని ఏదోగా భావించి ఆయన వస్తువులను పూర్తిగా శోధన చేయడం ప్రారంభించారు. ఇళయరాజా వివరణ ఇవ్వబోయినా వినిపించుకోకుండా వారి కుటుంబసభ్యులు సహ ఒక పక్కన నిలబెట్టారు. దీంతో ఆగ్రహం చెందిన ఇళయరాజా అధికారులతో వాగ్వాదానికి దిగారు.

అదే సమయంలో అక్కడికి వచ్చిన ఒక టీవీ చానల్ విలేకరి పరిస్థితిని గ్రహించి ఇళయరాజా గురించి అధికారులకు వివరించడంతో ఆయన్ని కుటుంబసభ్యులు సహా విమానాశ్రయంలోకి అనుమతించారు. ఈ తతంగం అంతా సీసీ కెమెరాల్లో చూసిన ఉన్నతాధికారి ఒకరు వెంటనే అక్కడికి వచ్చి ఇళయరాజాకు క్షమాపణ చెప్పి ఆయన్ని చెన్నై విమానం ఎక్కించారు.
 
ఇళయరాజాకు వైగో మద్దతు
ఇళయరాజాకు జరిగిన అవమానానికి ఎండీఎంకే నేత వైగో తీవ్రంగా ఖండించారు.ఈ సంఘటన గురించి ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రపంచ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంగీత దర్శకుడు ఇళయరాజా అన్నారు. ఏ దేశ సంగీతదర్శకుడు చేయనటువంటి సింపోనిని చేసిన గొప్ప సంగీత దర్శకుడు ఆయన అని అన్నారు.ఆయనకు జరిగిన అవమానం గురించి ఉన్నత స్థాయిలో విచారణ జరిపి అందుకు బాధ్యులైన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు